#


Index

భరత లక్షణులు

దొరుకుతాడని వాపోతాడు. ఇక్కడ లక్ష్మణుణ్ణి ఆయన సహోదరుడని భ్రాత అని రెండు మాటలలో పేర్కొంటాడు. సహోదరుడెలా అయ్యాడు లక్ష్మణుడు. కాదు గదా. అయినా రాముడలా చూచాడు తన తమ్ములనని అర్ధం చేసుకోవాలి మనం. సహోదరులనే అభిమానంతోనే చూచాడు వారిని.

  అసలొక విధంగా చూస్తే అందరూ సహోదరులే నని చెప్పినా తప్పులేదు. అందరూ ఒక తల్లి గర్భం నుంచే జన్మించారు నిజానికి. ఎవరా తల్లి. కౌసల్యగాదు, సుమిత్రగాదు, కైకగాదు, దశరథుడు పుత్రకామేష్టి చేసినప్పుడగ్ని కుండం నుంచి పైకి వచ్చిన ప్రాజాపత్య పురుషుడాయన కిచ్చిపోయిన దివ్యపాయసం. అది ముగ్గురు రాణులకూ పంచి ఇస్తే నాలుగు భాగాలుగావారి ఉదరాలలో ప్రవేశించింది. ఆ పాయస ప్రభావంవల్లనే వారు గర్భం ధరించి నలుగురు బిడ్డలను కన్నారు. కాబట్టి నలుగురికి వారి తల్లులుకారు. పాయసమే ఉపాదాన కారణం. పోతే తల్లులు కేవలం నిమిత్త కారణమే. ఈ దృష్టితో చూస్తే నలుగురు నిజనికి ఏకోదరులే సహోదరులే.

  అంతేకాదు ఇంకా కొంచెం వెనుకకు వెళ్లి ఆలోచిస్తే మన కింకొక దేవరహస్యం కూడా తెలుస్తుంది. అదేమిటంటే అసలు విష్ణువు రాముడుగా తానవతరిస్తానని చెప్పినప్పుడే దేవతలాయనతో విష్ణో రాజ్ఞో దశరథస్య త్వమయోధ్యాధిపతేః ప్రభోః తస్య భార్య సు తిసృషు – హ్రీశ్రీ కీర్త్వుపమాసుచ, విష్ణోపుత్రత్వమాగచ్ఛ – కృతాత్మానమ్ చతుర్విధమ్ – పితరంరోచయామాస - తదా దశరథమ్ నృపమ్- తన్ను తాను నాలుగుభాగాలు చేసుకొని దశరథుణ్ణి తనకు తండ్రిగా భావించాడట. అలా నాలుగు భాగాలు కావటం వల్లనే తరువాత రామాదులవతరించినప్పుడొక్కొక్క రొక్కక్క అంశలో జన్మించినట్టు వర్ణించింది రామాయణం. దీనిని బట్టి చూస్తే నలుగురని పేరేగాని నలుగురూ విష్ణ్వంశలే ఒకే ఒకవిష్ణువు నాలుగు మూర్తులు ధరించి అవతరించాడు. కాబట్టి అంతా కలిసి అఖండంగా ఒకే ఒక విష్ణు స్వరూపం. ఈ దృష్టితో చూచినా సహోదరులనే మాట సార్ధకమే అవుతుంది. నలుగురికీ మూల విరాట్టు ఒకడేగదా.

  అందుకే అసలు నలుగురికీ ఒకరి ఎడల ఒకరి కంతగాఢమైన అనుబంధం. ఒకరిని విడిచి ఒకరుండలేని అవినాభావ స్వభావం. మహర్షి వారికి నామకరణం చేయటంలో కూడా ఒకే ఒక అఖండతత్త్వమనే భావాన్ని మనకు స్ఫురింపజేశాడని

Page 204

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు