#


Index

భరత లక్షణులు

గదా జీవులు. అందుచేత తాంస్తధైవభజామ్యహమ్ అని భగవానుడనుగ్రహించటంతో ఆశ్చర్యమేముంది. అదే జీవేశ్వరుల నడుమ ఉండే రహస్యమైన ఒప్పందం. విచిత్రమైన భక్తి బంధం. అది ఆర్తభక్తి దగ్గర నుంచి వైర భక్తి వరకు ఎందరెందరో వ్యక్తులపట్ల ఎంతెంతో సుందరంగా భావబంధురంగా సాగుతూ వచ్చింది రామాయణ కథ ప్రబంధంలో. అందులో తల్లిదండ్రులున్నారు. సోదరులున్నారు. కులగురువులున్నారు. ఆచార్యులున్నారు. మంత్రులున్నారు. దాసీలున్నారు. దాసులున్నారు. త్యాగులున్నారు. మహర్షులున్నారు. వానరులున్నారు, పశుపక్ష్యాదులున్నారు, రాక్షసులున్నారు. కడకు దేవతలు కూడా ఉన్నారు. వీరిలో మరలా కొందరనుకూలురున్నారు. కొందరు ప్రతికూలులున్నారు. అయినా చమత్కారమేమంటే అనుకూలురైనా, ప్రతికూలురైనా అందరూ తన మార్గానికనుకూలురే. చివరకు పరశురాముడైనా, కైక అయినా మంథర అయిన శూర్పణఖ అయిన, మారీచుడైనా, వీరందరు తన అవతార ప్రయోజనానికి దోహదం చేసినవారే గదా. అలాగే విశ్వామిత్ర వసిష్ఠ శరభంగ సుతీక్షాగస్త్య సుగ్రీవ హనుమద్విభీషణాదులందరూ సాక్షాత్తుగానే తనకు సాహాయ్య మందజేశారు.

  పోతే అన్నింటినీ కాకపోయినా మనమిప్పుడు కొన్ని ముఖ్యమైన పాత్రలను తీసుకొని రాముడితో వారికున్న సంబంధమెలాంటిదో వారితో ఆయనకున్న అనుబంధ మెలాంటిదో చెప్పుకోవటం లాభదాయకం. ముందుగా భరత లక్ష్మణ పాత్రలను రెండింటినీ పరిశీలించి చూతాము. వీరిద్దరూ రాముడి తమ్ములే. భరతుడు పెద్దవాడు. లక్ష్మణుడు చిన్నవాడు. తమ్ములేగాని నిజానికిద్దరు సహోదరులుకారు. ఒక ఉదరం నుంచి జన్మిస్తే గదా సహోదరులయ్యేది. ఒక్కొక్క రొక్కొక్క తల్లికి జన్మించారు రామభరత లక్ష్మణులు. సహోదరులెలా అవుతారు. ఆ మాటకు వస్తే లక్ష్మణ శత్రుఘ్నలిద్దరే అసలైన సహోదరులు. ఇద్దరూ సుమిత్రా గర్భసంభవులే. అయినా నలుగురూ ఒకరి యెడల ఒకరు సహోదర భావంతోనే మెలగారు. రాముడు వాచ్యంగానే అది చాటుతాడొకచోట. యుద్ధంలో రావణ శక్తిపాతంవల్ల లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు రాముడు భీతిల్లి శోకోద్వేగ మాపుకోలేక సుగ్రీవాదులను చూచి ఇలా వాపోతాడు. దేశేదేశేకళత్రాణి - దేశేదేశే చబాంధవాః - తంతుదేశం నపశ్యామి - యత్రభ్రాతా సహోదరః భార్యపోతే మరొక భార్యను చేసుకోవచ్చు. చుట్టాలు పోతేమరలా చుట్టాలు లభిస్తారు దేశంలో. కాని సహోదరుడైన తమ్ముడుపోతే మరలా మనకేదేశంలో

Page 203

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు