#


Index

భరత లక్షణులు

భరత - లక్ష్మణులు

  ఇంతవరకూ సాగిన గ్రంథమంతా ఒక్కసారి సింహావలోకనం చేసి చూస్తే అంతా ఒక విధంగా రామావతార వైభవాన్ని గురించి ప్రతిపాదించినట్టే కనిపిస్తున్నది. అది రామాయణ కథ అనూ, కథాసంవిధానమనూ, అవాంతర కథలనూ, ఆయా వర్ణనలనూ, అవతారమను, ధర్మమను, ధర్మసూక్ష్మమనూ, ఏదైనా ఎలాంటిదైనా సరే. ప్రతిఒక్కటీ రామపరమే. రామమయమే. అసలు రామాయణమని వాల్మీకి పేరు పెట్టటమే అందుకోసమని గదా ముందుగానే పేర్కొన్నాము. ఏమిటి రామాయణమంటే. రాముడే అయనంగా కలది. అయనమంటే గమనం. నడక. అది రాముడి కభిముఖంగా ఇతరులు చేసేది కావచ్చు. ఇతరుల కభిముఖంగా రాముడు చేసేది కావచ్చు. అదీ ఆ పేరులోని స్వారస్యం. ఇందులో వాస్తవం రాముడినుద్దేశించి ఇతరలు చేసిందే. రాముడే కథానాయకుడు. కాబట్టి ఆయనగారే గమ్యం మిగతా పాత్రలందరికి. కాగా చిత్రమేమంటే ఆత్మారాముడే దశరథ రాముడుగా అవతరించాడు కాబట్టి ఆయనితరులకు గమ్యము అయ్యాడు. ఇతరులకు గమకమూ అయ్యాడు. అంటే తన చుట్టూ ఇతరులను తిప్పుతూ వచ్చాడు. ఇతర పాత్రలందరి చుట్టూ తాను మరలా తిరుగుతూ వచ్చాడు. మానవుడుగా అవతరించి మానవులతో లావాదేవీ పెట్టుకోవటం ఆయన వారి చుట్టూ తిరగటం. అలా పెట్టుకొన్న ఆయన గంభీరోదాత్తమైన చరిత్రకు ముగ్ధులై ఆయా వ్యక్తులాయనను తమ తమ శక్త్యానుసారం ఆరాధించటం ఆయన చుట్టూ వారు తిరగటం. మొత్తం మీద రెండూ ఆయన లీలే. రామలీలే.

  రామలీల కృష్ణలీల కన్నా నాలుగాకులెక్కువని గదా వక్కాణించాను. మానవుడుగా అవతరించినా కృష్ణుడు తాను ఈశ్వరుడుగానే భాసించాడు లోకానికి. ఇది అలా కాదు. రాముడు మానవుడుగా అవతరించాడు. మానవేంద్రుడుగా వ్యవహరించాడు. మానవాతీతుడైన ఈశ్వరుడుగా కూడా స్ఫురించాడు. ఇలా మూడు వేషాలలో కనిపించేసరికి మనకు మతిపోతున్నది. ఇందులో ఏదా ఆయన నిజస్వరూపమని. దానికి తోడు అది మనమెక్కడ గుర్తిస్తామోనని తన ఈశ్వరత్వానికి

Page 201

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు