ఖడ్గమ్ సురచిరప్రభామ్ – నిష్కృష్యకోశాద్విమలం శిరశ్చిచ్ఛేదరాఘవం ఖడ్గం ఒర నుంచి పెరికి వాడి శిరస్సు నరికివేశాడట. ఏమిటీ ఘోరమని నీకూ నాకూ అనిపించవచ్చు. ధర్మసూక్ష్మమనేది అలాగే ఉంటుంది. మనం ధర్మమని భావించింది ధర్మం కాకపోవచ్చు. మన మధర్మమని చూచేది గొప్ప ధర్మమే కావచ్చు. మనమల్పజ్ఞులం. మన బుద్ధులు, ఆ బుద్ధులతో చేసే నిర్ణయాలు రెంటికీ హద్దులున్నాయి గుణదోషాలు నిర్ణయించటానికే పరికరాలు పనికిరావు. త్రికాలజ్ఞులైన మహర్షులు వారు సృష్టించిన వాఙ్మయం మనకు ప్రమాణం. అది ఎంత కఠినంగా శాసించినా మనకు శిరోధార్యమే. ఈ కాలంలో మన రాజ్యాంగము, మన శాసనవిధానాలు, ఎలా ఉన్నా మనకెంత సరిపడకున్నా ప్రశ్నించగలుగుతున్నామా చచ్చినట్టు దాన్నిమనం నెత్తిన పెట్టుకోవటం లేదా అలాగే అనుకోండి ఏ ధర్మమైనా. అలాంటి ఒకానొక ధర్మ సూక్ష్మమే ఈ శంబూక వధ కూడా. పైగా వధించినవాడెవడు. మనలాంటి నరుడా ? లేక నరేంద్రుడా ? కాడు నరుడూ కాడు. నరేంద్రుడు కాడు. ఈ ఇద్దరి పరిధీ దాటిన నారాయణుడు. మరి నారాయణుడు చేసిన కృత్యం నరులకేమంతు పడుతుంది. నారాయణుడి లీల నారాయణుడికే వేద్యం. కనుకనే శంబూక వధానంతరం అగస్త్యాశ్రమానికి వెళ్లితే రాముడగస్త్యుడాయనను చూచి త్వమ్మేబహుమతోరామ - గుణైర్బహుభిరుత్తమైః సురాహికథయంతి త్వామాగతం శూద్రఘాతినమ్ నీవు శూద్రుణ్ణి వధించి బ్రాహ్మణ బాలుణ్ణి బ్రతికించి వచ్చావని దేవతలు చెబితే విన్నాను. చాలా మంచి పని చేశావు. త్వంహినారాయణః శ్రీమాన్ త్వయి సత్యం ప్రతిష్ఠితమ్ నీవు సాక్షాన్నారాయణుడవు. నీలోనే సత్యం ప్రతిష్ఠితమయి ఉన్నది. త్వం ప్రభు స్సర్వభూతానామ్ సమస్త ప్రాణులకు శాసకుడవు నీవే. నీవు చేసిన పని కాక్షేపణ ఏమున్నదని ప్రశంసిస్తాడు. ఇక మన మభిశంసించి ఏమి ప్రయోజనం. ఊరక మన అల్పజ్ఞతను చాటుకోవటమే. కాకపోయినా నారాయణుడు చేసిన పని నరుడికెలా బోధపడుతుంది. ముహ్యంతియత్సూరయః అని గదా భాగవతం మ్రోగించిన సందేశభేరి పైగా రాజదండనవల్ల యమదండన లేకపోవటమే గాక ఆ శూద్ర తపస్వికి అనుకోకుండా స్వర్గసుఖమే లభించింది. ఇది ఆగ్రహవ్యాజంతో భగవానుడు చూపిన అనుగ్రహమని భావిస్తే ఇక ఏ గొడవా లేదు. కాబట్టి ధర్మమే గాదు మనం గ్రహించవలసింది. ధర్మసూక్ష్మం. అంతవరకూ దృష్టి సారిస్తే ఇక ఎలాంటి ఆక్షేపణలకూ చోటులేదు రామాయణంలో.
Page 200