మనమనుకునే మంచి చెడ్డకాదు. సత్త్వరజస్తమస్సులు. అందులో సత్త్వరజస్సుల హెచ్చుతగ్గుల వల్ల బ్రహ్మక్షత్రా లేర్పడితే రజస్తమస్సుల హెచ్చు కుందుల వల్ల వైశ్య శూద్రులు. శూద్రులు తమోగుణ ప్రధానులు. లేదా తమోగుణ ప్రధానుడెవడో వాడు శూద్రుడు. తమస్సు మూఢత్వానికి మారు పేరు. చదువు సంధ్యలు సంస్కారము లేనివాడని అర్ధం. అలాంటివాడికి పరిచర్య తప్ప తపశ్చర్య పనికిరాదు. పెద్దలను పరిచరించి తద్వారా శమదమాదులూ, జ్ఞానవిజ్ఞానాలూ, గడించి క్రమంగా శూద్రత్వం పోగొట్టుకొంటే సంస్కారవంతుడవుతాడు. తపశ్చర్యాదుల కప్పుడర్హుడవుతాడు. అంతవరకూ అర్హత లేదు. ఇప్పుడూ అంతేగదా. ఒక వర్గం వారు చేసిన పని మరొకడికి లాయకు కాదు. ఒకడు వైద్యశాస్త్రం చదివి మరొక వైద్యుడి వద్ద కొన్నేండ్లు శిక్షణ పొంది తరువాత గదా వైద్యవృత్తి కర్హుడవుతాడు. అవి ఏవీ లేకుండానే ఒక బోర్డు తగిలించుకొని వైద్యం చేస్తే ఒప్పుకొంటుందా ప్రభుత్వం. తగిన శిక్ష విధిస్తుంది.
అలాగే శిక్షించాడు రాముడు కూడా శంబూకుణ్ణి. విప్రుడు అకాలంగా మరణించిన తన కుమారుణ్ణి రాజద్వారం దగ్గర పెట్టి ఇదంతా నీ పరిపాలనలో దోషమే. లేకపోతే కేనాద్యదుష్కృతేనాయం బాల ఏవమమాత్మజః - అకృత్వాపితృ కార్యాణి - గతోవైవస్వతక్షయమ్ - నాలోనూ నీలోనూ ఏ దోషమూ దొరలకుండానే నాకు పితృకార్యం చేయవలసిన నా పుత్రుడు అకాలంగా ఇంత చిన్న వయసులోనే కన్ను మూస్తాడా అని మొరపెడతాడు. అందుకు రాముడు మధన పడుతుంటే నారదుడు సలహా ఇస్తాడాయనకు. ఏమని. రామ ! యుగధర్మమని ఒకటున్నది. తపశ్చర్య అనేది కృతంలో బ్రాహ్మణుడూ, త్రేతలో క్షత్రియుడూ, ద్వాపరంలో వైశ్యుడూ, కలిలో శూద్రుడూ చేయాలి. ప్రస్తుతం శూద్రుడెవడో తొందరపడి ఈ త్రేతాయుగంలోనే చేస్తున్నట్టున్నాడు. ఆ ధర్మ వ్యతిక్రమం వల్లనే ఈ బ్రాహ్మణ బాలుడు మరణించి ఉంటాడు, కనిపెట్టమని చెబుతాడు. వెంటనే రాముడు పుష్పకాన్ని స్మరించి తదారూఢుడై నగరం నలుమూలలా వెదికితే దక్షిణ దిశగా ఒక సరస్సులో తల్లకిందులుగా వ్రేలుతూ తపస్సు చేసే శంబూకుడనే శూద్రతాపసి ఒకడు కనిపిస్తాడు. దగ్గరికి వెళ్లి నీవే వర్ణం వాడివని ప్రశ్నిస్తాడు రాముడు. శూద్రయోన్యామ్ ప్రసూతోస్మి అని నిజమే చెబుతాడు వాడు. అంతేకాక సశరీరంగా స్వర్గానికి వెళ్లాలని ఈ దారుణమైన తపస్సు చేస్తున్నానంటాడు. అసలు శూద్రుడు తపస్సు చేయటమేతప్పు. దానికి తోడు తలకు మించిన ఫలితాన్ని ఆశించటమంతకన్నా అపచారం. వెంటనే
Page 199