వైకుంఠయాత్ర వెళ్లలేడు. అయితే ఆ వెళ్లే లోపల రాజ్యానికొక వారసుణ్ణి ఇచ్చి వెళ్లాలి. అది కూడా నెరవేరుతుందని గ్రహించాడు సీత గర్భం ధరించటంలో. సరే ఒక మంచి ముహూర్తం చూచుకొని ఈవిడను అడవికి సాగనంపాడు. మరో ముహూర్తం చూచి లక్ష్మణుణ్ణి దేశంలో నుంచి దూరంగా వెళ్లగొట్టాడు. ఏకో నారాయణః అని తానొక్కడే మిగిలాడు చివరకు. ఎవరికెవరు. ఎవరికి వారే ఈ జీవులు. తానే గదా వర్ణించాడు ఇంతకు ముందు అయోధ్యలో యథాకాష్ఠంచ సమేయాతామ్ మహార్ణవే సమేత్యచవ్యపే యాతామ్ తథాదారాస్సుతాః పితా అని. జీవుల పరిస్థితే ఇలాంటిదని వర్ణించినప్పుడిక దేవుడి పరిస్థితి చెప్పేదేముంది. కాబట్టి ఈ అవతార రహస్యం తెలిస్తే మనమిక ఈ విషయంలో ఎలాంటి విమర్శ చేయబోము.
పోతే ఇక ఆఖరి ఆక్షేపణ రాముడి విషయంలో ఒక్కటే ఒకటున్నది. అది ఉత్తరకాండలో సీతా పరిత్యాగానంతరం జరిగిన శంబూక వధ. శంబూకుడేమి చేశాడని వాణ్ణి వధించటం. వాడొక శూద్రుడు. తపస్సు చేస్తున్నాడు. తపస్సు అనేది ఎవరినీ బాధించటం కాదు. వేధించటం కదు. వాడిపాటికి వాడు చేసే పని. మంచిపనేగాని చెడ్డపనిగాదు. అది నేరమెలా అయింది. నేరం కాకపోతే వాణ్ణి చంపటం దేనికి. వాడి తపస్సు మూలంగా ఒక బ్రాహ్మణ కుమారుడు చచ్చాడనటం, అందువల్ల అది అధర్మమనటం ఏమి సబబు. ఎవడి ప్రారబ్ధంవల్ల వాడు చస్తాడుగాని ఒకడు చేసిన దానివల్ల మరొకడు చచ్చేదేమిటి ? పైగా అధర్మమెలా అయింది తపస్సు. కాకుంటే దానివల్ల పిల్లవాడు మరణించాడని చెప్పటమేమిటి ? చూడబోతే ఇదంతా అగ్రజాతులు అవరజాతుల మీద చేసే దారుణమైన అన్యాయమూ, అక్రమమూ అని చాలామంది ఈ రోజుల్లో చేస్తున్న ఆక్షేపణ.
అరసి చూస్తే ఇది కూడా అర్ధంలేని ఆక్షేపణే. వర్ణాశ్రమ ధర్మాలనేవి ఇప్పుడేర్పడినవి కావు. మానవుడీ భూమిమీద అవతరించినప్పటి నుంచీ అతణ్ణి అంటిపెట్టుకొని ఉన్నవే. మనమిప్పుడు చూచే రూపంలో కాక పోయినా ఏదో ఒక రూపంలో ఉండి తీరవలసిందే. సమాజంలో మేధావులు కొందరుంటారు. పాలకులు కొందరుంటారు. వ్యాపారులు కొందరైతే శ్రామికులు మరికొందరుంటారు. నాలుగు వర్ణాలని కాకపోయినా నాలుగు వర్గాలైనా ఉండక తప్పదు. ఇప్పుడూ ఉన్నాయి కదా ఇవి అన్ని దేశాల్లో, అన్ని జాతుల్లో ఉన్నాయంటే అవి ఎలా ఏర్పడ్డాయి. వారి వారి గుణాలవల్ల గుణాలను బట్టే ఆయా కర్మలు లేదా వృత్తులు. గుణమంటే
Page 198