#


Index

ధర్మ సూక్ష్మములు

పేర్కొన్నాడు మహర్షి. రాముడెవరు. సాక్షాద్విష్ణువే. రావణుడివల్ల బాధలు పడలేక తన్ను వేడుకొంటే వారి కోసమని చెప్పి మానవుడుగా అవతరించాడాయన. తనకా ఉద్యమంలో సహాయం చేయటానికే వానరాది రూపాలతో సుగ్రీవాదులవతరించారు. అప్పటికది రామకార్యం కూడా కాదు. దేవకార్యమే. అంటే వాలి సుగ్రీవుల కార్యమే ఇది. రాముడి కార్యం కాదన్నమాట. వారలా అవతరించిన తరువాత ఋక్షవానరాది సైన్యాలంతా అన్నగారిని కొందరూ, తమ్ముణ్ణి కొందరూ ఆశ్రయించి వారిని సేవిస్తూ వచ్చారు. అన్నదమ్ములిద్దరూ ఒద్దిక గలిగి కిష్కింధలో నివసిస్తున్నారు. వారి జీవిత ధ్యేయమంతా రావణాది రాక్షస సంహారార్థమవతరించిన రాముడికి సహాయపడటమే. అంతేగాని తమలో తాము కీచులాడుకోవటము, పోట్లాడుకోవటము కాదు. అది మొదలు చెడ్డబేరం. ఇలా మొదలు చెడ్డ బేరం చేసి కూచున్నాడిప్పుడు వాలి. అంతవరకూ కలసి మెలసి ఉన్నవాడు తమ్ముడితో నిష్కారణంగా రగడపడ్డాడు. వాడెంత బ్రతిమాలినా వినలేదు. తరిమికొట్టాడు. చంపటానికి పూనుకొన్నాడు. చివరకు వాడి భార్యనే అపహరించాడు. చేసేది లేక సుగ్రీవుడు ఋశ్యమూకం మీద ఏదో నలుగురు నమ్మిన బంట్లను చుట్టూ పెట్టుకొని నమోనమో అని బ్రతుకుతున్నాడు.

  ఇది రామబ్రహ్మాని కెక్కడలేని ఆగ్రహం తెప్పించింది. తనకు ఇద్దరూ కలిసి తోడ్పడవలసి ఉండగా వారిలో ఒకడు అన్యాయంగా ఇంకొకడిని దురుసుగా వెళ్లగొట్టి తన బలాన్నే తాను నమ్ముకొని తనంతవాడేలేడని విర్రవీగుతున్నాడు. తన కోసమే పరమాత్మ అవతరించాడనే విషయమే మరచిపోయి పామరంగా బ్రతుకుతున్నారు. అహంకరించాడు. ఆ అహంకారానికి తగిన చికిత్స చేసి అతడి కళ్లు తెరిపించాలి స్వామి. ఇది కథలో దాగి ఉన్న అంతరార్థం. దీనికి స్పోరకంగా సాగింది బాహ్యమైన కథ. అది రెండు విషయాలలో బయటపడుతుంది మనకు. కబంధుడు శాపవిమోచనా నంతరం రాముడికి భావికర్తవ్యాన్ని బోధిస్తూ కిష్కింధకు పొమ్మని వాలి సుగ్రీవులలో వాలితో గాక సుగ్రీవుడితోనే మైత్రి చేయమని చెబుతాడు. సుగ్రీవుడు ధర్మాత్ముడని అతణ్ణి వాలి అనవసరంగా బాధించాడని కూడా విన్నవిస్తాడు. ఇది రాముడి అంతశ్చేతనలో దాగి ఉన్న ఆత్మారాముడికి తన కర్తవ్యాన్ని గుర్తుకు తెచ్చింది. పోతే మరొక విషయం. సీతను రావణుడెత్తుకుపోయే సంరంభంలో ఆవిడ తన సొమ్ములు తీసి మూటగట్టి క్రిందికి చూచి సూటిగా ఋశ్యమూకం మీద కూచుని ఉన్న

Page 194

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు