#


Index

ధర్మ సూక్ష్మములు

ఛాయాంతా మతిశయినీమ్ సమాశ్రయిష్యే. నాకు ఇక్కడ ఉన్న ఈ కానన ద్రుమాలు గొడుగు పట్టి నీడనిస్తాయి. శత్రుఘ్నః కుశలమతిస్తుతే సహాయరి సౌమిత్రిర్మమ వివితః ప్రధాన మిత్రమ్ మరి నీకు మంత్రి శత్రుఘ్నుడైతే నాకీ సౌమిత్రి మంత్రిగా ఉంటాడంటాడు. ఇలా ఇద్దరూ ఒకరు పట్టణాలలో ఒకరు అరణ్యాలలో రాజ్యం చేద్దామని ఒప్పందం చేసుకొన్నారు. అందుకే మృగాదులను శిక్షించే భారం రాముడి మీద ఉంది. మరి మృగాలకు మానవ ధర్మమెలా వర్తిస్తుందని గదా ప్రశ్న. మృగరూపాలలో ఉన్నారనే గాని వాలి సుగ్రీవులు మిగతా జాతిమృగాల లాంటివారు కారు. రాజులై రాజ్యాలు చేస్తున్నారు. మానవులతో వ్యవహరిస్తున్నారు. కామరూపాది శక్తులున్నాయి వారికి అందుకే నరుడిలాగా సంబోధిస్తాడు వానరుణ్ణి కూడా రాముడు. అయితే మృగాలను వేటాడటం మాకు ధర్మమని చెప్పే మాటకర్థమేమిటని మరలా ప్రశ్న. మృగస్వభావమే ఇక్కడ మృగమంటే. మృగాకృతిలో ఉన్నా మృగాతీత శక్తులతో విజ్ఞానంతో వ్యవహరించినంత వరకూ పరవాలేదు. కాని అవన్నీ పారదోలి కేవల ఉపాధి ధర్మాన్నే అనుసరించాడు వాలి. అందుచేత మృగయా వ్యవహారాన్నే పాటించాను పొమ్మన్నాడు రాముడు.

  మరి చాటునుంచి ప్రయోగించటం దేనికి బాణం. వాలి ఎదుటకి రావటానికి భయమా. అదేగా అన్నాడు వాడు. నీవు చాటునుంచి కొట్టావు కాబట్టి బ్రతికిపోయావు గాని నా కంటబడి ఉంటే చచ్చేవాడివని. అది కేవలం వాడి ఔద్ధత్యాన్ని సూచిస్తుంది గాని అర్ధవంతమైన మాట గాదు. ఎందుకంటే చాటునుంచి వేసినా ఎదటబడి వేసినా రామబాణం రామబాణమే. దాని కెదురులేదు. వాలికాదు. ఎవరూ చెప్పలేరు దానికి జవాబు. పరశురాముడే చెప్పలేకపోయాడు. వాలి ఏమిటిక లెక్క సప్తసాలాలు ఒక్కదెబ్బలో భంజించిందాబాణం. ఎదుటబడి వేసినా ఒక్కటే. చాటు నుంచి వేసినా ఒక్కటే. ఎలా వేసినా గురి తప్పని దది. ఇది రాముడి బాణమని కూడా కాదు మనం చూడవలసిందిక్కడ. రామవేషంలో రాముడి బాణమని కూడా కాదు మనం చూడవలసిందిక్కడ. రామావేషంలో ఉన్న పరమాత్మ బాణం. దేవుడి బాణం మనకెప్పుడూ చాటునుంచే వచ్చి తగులుతుంది. ఎప్పుడెక్కడి నుంచి వచ్చి తగులుతుందో చెప్పలేమాదెబ్బ. ఎవరికీ తెలియకుండా చేశాము గదా ఈ పని అని సంతోషిస్తుంటాడు జీవుడు. కాని సర్వాంతర్యామి అయిన దేవుడన్నీ కనిపెట్టి చూస్తూనే

Page 192

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు