చాటునుంచి చంపినా నీవు తప్పు పట్టటానికి లేదు. అందుచేత ధర్మసూక్ష్మం తెలుసు కోకుండా మాట్లాడకు. చపలుడివి నీవు. పుట్టుగ్రుడ్డివి. నీకు ధర్మమే మెఱుక, స్వయంగా ఎఱగవు. ఎఱుక గల పెద్దల నడిగి తెలుసుకోవు. సూక్ష్మమూ, పరమాదర్శమూ ధర్మమంటే. ఇప్పటికైనా తెలుసుకోవటం మంచిది. ఇది రాముడిచ్చిన సమాధానం.
దీనితో వాలి ఇక నిరుత్తరుడయి పోయాడు. యత్త్వమాతనర శ్రేష్ఠ ! తదేవ, నాత్రసంశయః నీవేది చెప్పావో అది అంతే. దానికిక తిరుగులేదు. అనవసరంగా నిన్ను తూలనాడాను. నన్ను మన్నించమని వేడుకొంటాడు. అయితే అతడు మన్నించమన్నా మనం మన్నించలేకపోతున్నాము రాముణ్ణి. ఎన్ని సమాధానాలిచ్చి వాలిని నోరు మూయించినా అవన్ని కుంటి గుడ్డి సమాధానాలేనని మనవాళ్ల అభియోగం. భరతుడు రాజుగాని రాముడేమిటి రాజు. రాజ్యాధికార మతనికెక్కడది. భరతుడెప్పుడు నియోగించాడతణ్ణి. ఇది ఒక ప్రశ్న. మానవుల శిక్షా స్మృతి పశుపక్షి మృగాదులకెలా వర్తిస్తుంది. ఇది రెండవ ప్రశ్న. వర్తించిందే పో. ఎన్నో ఉన్నాయి గదా మృగాలు అరణ్యంలో అవి తమలో తాము వావి వరుసలు లేకుండా ఎలా ప్రవర్తిస్తున్నాయో. వాటినన్నిటినీ అలాగే శిక్షించాలి గదా. శిక్షించాడా మరి. మూడవ ప్రశ్న సుగ్రీవుడితో సఖ్యం చేశాను కాబట్టి అతడికి మేలు చేయాలనటమేమిటి ? ఆసఖ్యం వాలితోనే చేయవచ్చు గదా. నాలుగవ ప్రశ్న.
వీటికి జవాబు రాముడి మాటలలోనే ఉంది బాగా ఆలోచిస్తే దానికి తోడు పూర్వాపరాలు కలియబోసుకొని చూస్తే ఇంకా బాగా అర్ధమవుతుంది మనకు. రాముడు రాజేమిటని గదా సందేహం. రామ భరత సంవాదంలో తెలుస్తుంది రహస్యం మనకు. భరతుడూరక ప్రాణం తీస్తుంటే పట్టణానికి రమ్మని, రాజ్యపాలన చేయమని రాముడతనితో ఇలా అంటాడు. త్వమ్రాజా భరభవస్వయం నరాణామ్ వన్యానా మహమపిరాజరాణ్మృగాణామ్ నీవు జనపదంలో నరులకందరికీ పాలకుడవై ఉండు. నేనీ జనస్థానంలో మృగజాతులన్నిటికీ పాలకుడనై ఉంటాను. గచ్ఛత్వం పురనరమధ్య సంప్రహృష్టః - సంహృష్టస్త్వహమపి దండకాన్ ప్రవేక్ష్యే. ఇక నీవు సంతృప్తిపడి అయోధ్యకు వెళ్లు. నేను సంతృప్తితో దండక ప్రవేశిస్తాను. ఛాయాంతే దిన కరభాః ప్రబాధమానమ్ - వర్షత్రమ్ భరతకరోతు మూర్త్ని శీతామ్ నీకు ఎండ తగలకుండా శ్వేతచ్చత్ర మున్నట్టే. ఏతేషా మహమపికానన ద్రుమాణామ్ -
Page 191