#


Index

ధర్మ సూక్ష్మములు

తెచ్చి నీ పాదాలముందు పడవేసేవాడిని. కుర్రకుంక సుగ్రీవుడా ! నీకు తోడ్పడేవాడు ఏమయినా సరే నీవు చేసింది పొరబాటు. నేను చస్తే నా అనంతరం నా తమ్ముడు రాజ్యానికి రావటం ధర్మమేగాని నా తమ్ముణ్ణి నా నుంచి చీలదీసి నీవు నన్ను అక్రమంగా వధించటం మాత్రమూ ధర్మం కానేరదు.

  ఇలా ఒకటిగాదు, రెండుగాదు. సవాలక్షనిష్ఠురా లాడాడు వాలి రాముణ్ణి. అంతకన్నా నీవూ నేనూ ఆక్షేపించలేము కూడా. అయితే ఈ ఆక్షేపణలన్నిటికీ ఏమిటి సమాధానమని అడగవచ్చు. అదికూడా వాల్మీకే చాటిచెప్పాడు లోకానికి. ఆక్షేపణ వాలి ముఖంగా వినిపించి అందులో ప్రతి ఒక్కదానికీ సమాధానం రాముడి ముఖంగా మనకు వినిపిస్తాడాయన. అవిజ్ఞాయ కథం బాల్యా, న్మామిహాద్య విగర్హసే అని మొదట చీవాట్లు పెడతాడు రాముడు వాలిని. వాలీ నీకు ధర్మం తెలీదు. అర్ధం తెలీదు. కామమూ తెలీదు. పురుషార్థమంటే ఏమిటో తెలీదు నీకు. ఏదీ తెలియకుండానే నన్నధిక్షేపిస్తున్నావు. ఇక్ష్వా కూణామియం భూమిః ఈ భూమండల మంతా ఇక్ష్వాకు చక్రవర్తులది. ఇందులో నివసించే మృగపక్షి మనుష్య జాతులలో ఎవరే తప్పు చేసినా శిక్షించే అధికారి భరతుడు. ఆయన నియమించిన అధికారులం మేము. వనభూములకంతా పాలకులం. నీవు రాజువై కూడా కామమనే వ్యసనానికి వశుడివయి పోయావు. తండ్రి అన్న ఆచార్యుడు వీరు ముగ్గురూ కూడా తండ్రులే వాస్తవానికి. అలాంటి తండ్రి హోదాలో ఉన్న నీవు పుత్రుడిలాంటి నీ తమ్ముడి భార్యతో సంగమించే సాహసం చేశావు. వాడు బ్రతికి ఉండగా నీవాపని చేయరాదు. మహాపరాధం. అపరాధివి గనుక నీకు నేను శిక్ష విధించాను. భరతుడు రాజు. మేమాయన ప్రతినిధులము. నీవపరాధివి. దండించకుండా ఎలా ఉండగలను. అయితే సుగ్రీవుడితో ఎందుకు సఖ్యమంటావా ? వాడు నాకు లక్ష్మణుడి వంటివాడు. నా శ్రేయస్సు కోరేవాడు. శపథం కూడా చేశాను నేను వాడికి మేలు చేస్తానని మరి దాన్ని భంగం చేయటమేమి బాగు. నీవు కూడా వాడికది చేసి ఉండవలసింది. కాని చేయలేదు. మరి చాటునుంచి బాణం వేసి చంపావని గదా ఆక్షేపించావు. మేము క్షత్రియులం. మృగాలను వేటాడటం మాకలవాటు. వాటికెదురుగా ఉండే చంపనక్కర లేదు. వెనుక నుంచి ప్రక్కనుంచి దూరం నుంచి దగ్గర నుంచి కనపడుతూ కనపడకా, ఎలా చంపిన చంపవచ్చు వాటిని. నీవు అలాంటి ఒక శాఖామృగానివే. కాబట్టి

Page 190

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు