#


Index

ధర్మ సూక్ష్మములు

వారిలో వారు చూచుకొంటారు. తనకు దేనికి తమ అన్నదమ్ముల వ్యవహారంలో మరెవరియినా కలగజేసుకొన్నారా ? తాను దేని కితరుల వ్యవహారంలో జోక్యం చేసుకోవటం. ఒకవేళ తనకార్యం సాధించటం కోస చేసుకొన్నాడేపో. అందుకైనా బలవంతుడు వాలినే పట్టుకోవాలి గాని దుర్భలుడైన సుగ్రీవుణ్ణి పట్టుకొని ఏమిలాభం. కాబట్టి రాజనీతి కూడా కాదిది. అంతేకాదు. ఒక వీరుణ్ణి అంతమొందించాలనే ఆశయంతో ప్రవర్తించాడే అనుకోండి. అప్పటికే వీరోచితంగా పోరాడి వాణ్ణి సంహరించవచ్చు గదా. చెట్టు చాటునుంచి బాణం వేసి చంపవలసిన కర్మ ఏమి పట్టింది. ఇది ఇక్ష్వాకు వంశంలో పుట్టి రఘు దిలీపాది రాజన్యులను తాతముత్తాతలుగా పేర్కొనే మహా వీరునికి తగిన చర్యయేనా ? దీనివల్ల భీరుడనిపించుకొంటాడే గాని తాను వీరుడెలా అవుతాడు. ఇదుగో ఇలాంటి ప్రశ్న పరంపరలెన్నో శరపరంపరలాగా ఎదురవుతాయి ఈ సందర్భంలో హేతువాదులిప్పుడీ ఆక్షేపణలు చేస్తున్నారంటే మనం తప్పుపట్టనక్కరలేదు. ఎందుకంటే అసలీ హేతువాదులేమిటి ? వాల్మీకి మహర్షికే తోచాయీ ఆ శంకలన్నీ. తన మనసుకు తోచిన ఆ శంకలన్నిటినీ వాలి ముఖంగా తానే అనిపిస్తాడు రాముడి దగ్గర. కధం దశరధేనత్వం జాతః పాపోమహాత్మనా పెద్దమనిషి అనిపించుకొన్న దశరథుడికింత నీచవర్తనుడివి నీవెలా జన్మించావు. సత్వాంవినిహతాచారం ధర్మధ్వజ మధార్మికం జానేపాపసమాచారం తృణైః కూపమివావృతం నీవేమి ధర్మజ్ఞుడివి. ధర్మధ్వజుడివి. తృణచ్చన్నకూపానివని తెలియక మోసపోయాను. అందుకే తార వద్దంటున్నా రాముడంటే కరుణాళుడు. ప్రజాహితకారి సమయజ్ఞుడు, దృఢవ్రతుడు అని లోకంలో నలుగురూ నిన్నిలా ప్రశంసిస్తుంటే విని అలాంటివాడు నాకెందుకు కీడు చేయబోతాడు లెమ్మని బరవసాతో వచ్చి మావాడితో తలపడ్డాను. నీవు కీడు చేయనే చేశావు. కనపడకుండా చాటునుంచి చేశావు కాబట్టి బ్రతికిపోయావుగాని 'దృశ్యమానస్తు యుధ్యేధా, మయాయదినృపాత్మజ, అద్యవైవస్వతం దేవం, పశ్యేస్త్వం నిహతోమయా' నా కంటబడే నీవు యుద్ధం చేసి ఉంటే ఈ పాటికి నాచేత చావుదెబ్బలు తిని యమధర్మరాజును దర్శించేవాడివి. కాకపోయినా నీవెంత అమాయకుడివి. నిన్ను చూస్తే నాకు జాలి వేస్తుంది. సీత కోసమే ఇంత పని చేశావంటే సిగ్గుచేటు. సీతకోసమే అయితే కంఠేబద్ధ్వా ప్రదద్యాంతే నిహతం రావణంరణే - ఆవిడ నపహరించిన రావణుణ్ణి చంపకుండానే పట్టి

Page 189

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు