ఇందులో కూడా ముందు చెప్పుకొన్న ఒకానొక సూత్రాన్ని అనుసంధించుకొంటే సరిపోతుంది. రెండు పరస్పర విరుద్ధ ధర్మాలొక ఆదర్శప్రాయుడనుకొన్న పాత్రలో కవి వర్ణించి చూపాడంటే అవి రెండూ పరమార్ధమని చెప్పటానికి లేదు. 'పరిహాస విజల్పితంసఖే, పరమార్థేన నగృహ్యతాంవచః' అని కాళిదాసు చెప్పినట్టు ఒకటి ఆ పాత్రకు స్వలక్షణమైన మరొకటి తత్తదుపాధి లక్షణాలను అనుసరిస్తూ అలా లోకానికి ప్రదర్శించటం కావాలి. రెండు స్వలక్షణం కావటానికి లేదు. అలాగే అయిననాడు రాముడెప్పుడూ సీతనంటిపెట్టుకొనే ఉండాలి. విడిచిపెట్టగూడదు. ఎవరేమన్నా పట్టించుకోగూడదు. అలా చేశాడా మరి జీవితంలో చేయలేదే. అప్యహం జీవితం జహ్యాం త్వాంచసీతే సలక్ష్మణాం నతుప్రతిజ్ఞాం సంశ్రుత్య నేను నా జీవితమైనా వదలుకోగలను. నిన్నైనా వదులుకోగలను లక్ష్మణుణ్ణినా వదలగలను. కాని నాకు మాటంటే మాటే. అది మాత్రం వదలలేనని సీతతోనే అన్నాడాయన ఒకమారు. అలాగే నిలబెట్టుకొన్నాడామాట. ఎవరూ ఆక్షేపించకముందే ఆవిడ ననుమానించి పరీక్ష పెట్టాడు లంకలో. అయోధ్యలో మరలా ఎవడో ఆక్షేపించాడని అసలు పరిత్యజించా డావిడను. తరువాత ఇక తాక తలుచుకోలేదు. లక్ష్మణుజ్జెతై ప్రతిజ్ఞ కోసం దేశాంతరానికే వెళ్లగొట్టాడు. అంత నిష్కామంగా వ్యవహరించగలిగిన వాడింత కాముకుడయి బేలగా పలవించాడంటే ఎలా నమ్మటం, కనుకనే ఇది కేవల మభినయమని వాక్రుచ్చటం లోకానికలాంటి వ్యసనం పనికిరాదని బోధించటమే ఈ అభినయానికంతటికీ ఫలశ్రుతి అని కూడా హెచ్చరించటం.
ఇక్కడికి కామవ్యవహారం పరిష్కారమయింది. పోతే ఇక కిష్కింధలో పరిష్కరించవలసిన వ్యవహారం మరొకటున్నది. అది వాలి వధ వ్యవహారం. ఒక న్యాయస్థానంలో వ్యవహారంలోలాగానే అది కొన్ని శతాబ్దాల బట్టి విమర్శలోకంలో పాతుకొని ఉంది. ముఖ్యంగా హేతువాదులీ కాలంలో దాన్ని మరే సాగదీస్తున్నారు. వారనేదేమంటే రాముడు వాలిని వధించటం అన్యాయం. అపచారం. అతడాయనకు చేసిన అపకారమేమిటి. సుగ్రీవుడు చేసిన ఉపకారమేమిటి ? ఏది కాదు. వాలి సుగ్రీవులిద్దరూ తన కంతవరకూ అపరిచితులే. ఎవరివల్లా తనకు మంచిగాని చెడ్డగాని ఏది జరగలేదు. అలాంటప్పుడందులో ఒకరినెక్కదీసి మరొకరిని కుంగదీయవలసిన అవసరం తనకేమిటి. వారిద్దరూ అన్నదమ్ములు పోట్లాడుకొన్నా పొందికగా ఉన్న
Page 188