#


Index

ధర్మ సూక్ష్మములు

ఆలోచించినా సీతే. ఏది మాట్లాడినా సీతే. జంటగా తిరిగే పక్షి మృగాదులను చూచి అసూయ పడతాడు. చెట్లు చేమలు చూచి చీదరించుకొంటాడు.

  ఏమిటి వ్యవహారం ? ఏమిటి ఉన్మాదం ? ఇలాంటి కామోన్మాదం తమ్ముడు లక్ష్మణుడికే లేదే. తనకుండటం ఎంత శోచనీయం. వాడు తన భార్యనే వదిలి వచ్చి తనకు సేవ చేస్తున్నాడు. కలలో కూడా అనుకోవటం లేదు తన ప్రియురాలిని. ఈయన కెందు కింత ఆరాటం. ఇంత తపన. అందుకేనేమో అప్పుడప్పుడు లక్ష్మణుడే ఆయనను మందలిస్తూ వచ్చాడు. సంస్తంభరామ భద్రంతే మాశుచః పురుషోత్తమ నేదృశానాం మతిర్మందా భవత్యకలుషాత్మనాం మీలాంటి పెద్దలిలా బాధపడరాదు. బెంబేలు పడరాదు. మనసు కొంచెం చిక్కబట్టండన్నయా పురుషోత్తముడవు గదా నీవు. త్యజ్యతాం కామవృత్తత్వం - మహాత్మానం - కృతాత్మాన - మాత్మానం నావబుధ్యసే - కామోద్రేకాన్ని విడిచిపెట్టు. మహాత్ముడవయి కూడా నిన్ను నీవు తెలుసుకోలేక పోతున్నావేమిటి ? వినయంగా చెప్పినా ఎంత ఘాటుగా చెప్పాడో చూడండి లక్ష్మణుడు. లక్ష్మణుడేమిటి ? ఆకఱుకు వానరజాతిలో పుట్టిన సుగ్రీవుడు కూడా చీవాట్లు పెట్టవలసి వచ్చిందాయనను. అలంవైక్లబ్యమాలంబ్య - ధైర్య మాత్మగతంస్మర దైన్యాన్ని వదలి ధైర్యాన్ని అవలంబించు రామా ! త్వద్విధానామసదృశం, ఈ దృశం విద్ధిలాఘవమ్ మీలాంటి వారికి ఇలాంటిబేల తనం తగిన లక్షణంకాదు. మయాపి వ్యసనం ప్రాప్తం భార్యాహరణజం మహత్ నాకూ భార్య వియోగదుఃఖం ప్రాప్తించింది నచాహమేవం శోచామి, నచధైర్యం పరిత్యజే కాని నేనెప్పుడు ఇలా ఏడుస్తూ కూర్చోలేదు. నీలాగా ధైర్యం కోలుపోలేదు. ఇదంతా చూస్తే లక్ష్మణ సుగ్రీవులకున్న స్తిమితత కూడా రాముడికి లేదే. అలాంటి కామపరుడు, వ్యసనపరుడు, దుర్బలుడు దేవుడెలా అయ్యాడు ఆదర్శ పురుషుడెలా అయ్యాడని ఇప్పుడు ప్రశ్న.

  కనుకనే ఆయన దేవుడయ్యాడని మా జవాబు. ఇదేమిటి చాలా విడ్డురంగా ఉందే అనిపించవచ్చు. విడ్డూరంగానే ఉంటుంది మరి. దేవుడు గనుకనే ఆయన వ్యవహారమెప్పుడూ విడ్డూరమే జీవుడి దృష్టికి. మనకువిడ్డూరమైతే ఆయనకది వినోదం. ఆ వినోదాన్ని విడ్డూరాన్ని వర్ణించి చూపడమే వాల్మీకి రచనలోని విశేషం. నిష్కాముడు, నిరంజనుడు అయిన భగవానుడు లోకంలో అవతరించి సకాముడుగా

Page 186

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు