#


Index

ధర్మ సూక్ష్మములు

నిరంతర నిద్రాశీలుడని విభీషణుడు పరమ ధార్మికుడని బయటపెట్టింది. ఇరుగో ఖరదూషణలు నా సోదరులే. వారిక్కడే ఉన్నారీ దండకారణ్యంలో అని వర్ణించింది. ఇది తన భావికార్యక్రమం తనకది జ్ఞాపకం చేసినట్టయింది. ఇంకా ఆలస్యం దేనికి తయారుగా యుద్ధానికని హెచ్చరించి నట్టయింది. అందుకే రాముడంతగా దానితో చదురులాడి దాన్ని రెచ్చగొట్టటం ఏడిపించటం, రెచ్చిపోయి అది అఘాయిత్వం చేస్తుందని తెలుసు ఆయనకు. ఇప్పుడే చేద్దామనుకొన్నాడు దానికి శాస్త్రి. చేస్తే అది ఖరదూషణాదులను తన మీదకిపంపుతుంది. పంపితే వారిని చంపవచ్చు. చంపితే అది ఊరుకోదు. పోయి రావణుణ్ణి రెచ్చగొడుతుంది. అప్పుడూ కథ రసకందాయంలో పడేది. అందుకే ఈ నాటకమంతా. ఇంత ఉంటే ఇందులో ఇదంతా గమనించక ఏదో మన బుద్ధులకు తోచినట్టు అసంబద్ధంగా ఆలోచిస్తే ఏమి ప్రయోజనం. అది ఆ శూర్పణఖ చేసిన అసంబద్ధ ప్రలాపన మాదిరే అయి కూచుంటుంది.

  పోతే ఇక మూడవ ఆక్షేపణ రాముడి మీద ఆయన సీతా వియోగానంతరం పడిన ఆవేదన. రాముడంటే పరమాత్మ అని గదా మీరు బ్రహ్మరథం పడుతున్నారు. పరమాత్మే అయితే ఆయనకు కామక్రోధాది దౌర్బల్యాలుండగూడదు గదా. అలాంటి మాటలు, చేష్టలు పనికిరావు గదా. పైగా శూర్పణఖాదులంతా కాముకంగా వ్యవహరించారని గదా వారిని నిర్దాక్షిణ్యంగా శిక్షించాడు. అలాంటివాడు తానే భార్యావియోగాన్ని భరించలేక వాపోవటమేమిటి ? వలవల ఏడవటమేమిటి ? పైగా ఇంకా సిగ్గుబోయే విషయమేమిటంటే తనకన్నా చిన్నవాడు లక్ష్మణుడు. అతడి దగ్గర వలపోసుకోవటమేమిటి ? అరణ్యకాండాంతంలో కిష్కింధారంభంలో ఎంతగానో వర్ణించాడు వాల్మీకి రామవిలాపాన్ని యది దృష్టా త్వయాసీతా సీత మీకుకనపడిఉంటే చెప్పి నా ప్రాణాలు కాపాడమని అరణ్యంలో ప్రతిచెట్టునూ, ప్రతి పిట్టనూ బ్రతిమాలుతూ పోతాడు రాముడు. కింధావసి ప్రియేదూరం తిష్ఠ తిష్ఠ వరారోహే దూరంగా వెళ్లతావేమి ? నిలునిలు అని ఆవిడను చూచినట్టుగానే పలవరిస్తాడు. అనవసరంగా అందరిమీద కోపం చేసుకొంటాడు. పాపం జటాయువు తనకు తోడ్పడబోయి ప్రాణాలు కోలుపోయే దశలో ఉంటే తన సీతను చంపిందని ఆగ్రహిస్తాడు. ఇక వాలి వధానంతరం వర్షాకాలం నాలుగు మాసాలు ఋశ్యమూకం మీద నాలుగు యుగాలుగా గడిపాడా మహానుభావుడు. ఎక్కడ చూచినా సీతే. ఏది

Page 185

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు