ఇక ఈ రాక్షసి దేమిటి. పైగా స్త్రీకి సహజంగా ఉండవలసిన లజ్జకూడా చూపటం లేదది. అసహ్యంగా ప్రవర్తిస్తున్నది. అబద్దాలాడుతున్నది. దానితో అలాగే వ్యవహరించి తన్మూలంగా దాని కామానికి తగిన శిక్ష విధించదలచాడు పరమాత్మ. అందుకే దానితో పరహాసమాడటం. అటూ ఇటూ త్రిప్పి దాన్ని ఏడిపించటం. పాపం నీవెంత ముసలిదంటున్నా దీన్ని నేను వదలుకోలేను. నన్ను చేసుకొన్నా ఈ సవతిపోరు నీవు భరించలేవు. అదుగో వాడికే తగులమూలేదు. వాణ్ణి చేసుకోమని లక్ష్మణుడి దగ్గరికి పంపుతాడు. ఎలాగూవాడు పలకరించడని తెలుసు. అంతేగాక వాడొక ఆడదానితో ఎలా మాట్లాడుతాడో చూతామని వాడి మనసు తెలుసుకొందామనే పరీక్ష అయినా కావచ్చు ఆయన ఉద్దేశం. భగవానుడి సంకల్పం జీవులకంతు పట్టేదికాదు గదా. అన్నగారి మాటల్లో అంతరార్థమా తమ్ముడు చక్కగా గ్రహించినట్టుంది. కనుకనే ఆయన సీతను ముసిలిదంటే తానూ దానితో మావదినె నిజంగా ముసలిదే వెళ్లి మళ్లీ ప్రయత్నించి చూడు. తప్పకుండా వదిలేసి నిన్ను చేసుకొంటాడని పంపుతాడు. అది తిరిగి వచ్చి దీన్ని మింగుతానని ఇక పట్టలేక సీతమీదకి దూకబోతుంది. అక్కడికి వదిలేశాడు రాముడు హాస్యం. ఎందుకంటే అది అబద్ధాలాడినందుకు తానూ అలాగే దానికి జవాబిచ్చి ఏడిపించవలసినంత ఏడిపించాడు. ఇప్పుడది శ్రుతిమించి రాగాన పడింది. ఇక ఉపేక్షించరాదు. తగిన శిక్ష విధించాలి. అందుకే దానితో ఏమిటి పరిహాసం శిక్షించి పంపమని లక్ష్మణుణ్ణి హెచ్చరిస్తాడు.
ముసలిదికాని దాన్ని ముసలిదని దాన్ని విరూప అంటావా ? విరూపవే అయిపొమ్మని చెప్పినట్టయిందిప్పుడు. ఋజుబుద్ధుల దగ్గర వక్రబుద్ధితో ప్రవర్తిస్తే ఇదే శిక్ష అని చెప్పినట్టయింది. దీనిద్వారా స్త్రీగాని, పురుషుడుగాని కామానికి దాసులై ప్రవర్తించరాదని అలా కన్నుమిన్ను గానక ప్రవర్తిస్తే కీడు మూడటం ఖాయమని ఎవరి మాటలూ, చేష్టలు వారికే బెడిసి కొడతాయని ఒక గొప్ప సందేశమందిస్తున్నది రాముని ఈ చర్య. దానికొక అపదేశ మీ పరిహాసలూ అనృతంగా భాసించే ఆయన భాషణలు. ఇంకా ఒక లోతైన భావమున్నా ఉండవచ్చు రాముడి ఈ వ్యవహారంలో తానవతరించింది. రావణ సంహారానికి గదా ! శూర్పణఖ ఆ రావణుడి చెల్లెలు. అది చెప్పనే చెప్పిందా విషయం నేను ఫలానావాడి చెల్లెలినని పైగా కుంభకర్ణుడు
Page 184