కూతలే. ఇలాగే వర్ణించాడు వాల్మీకి. దీనిని బట్టి కామరూపిణి అయినా అది రూపం మార్చుకోకుండా రాక్షస రూపంలో నైనా వచ్చి ఉండాలి. లేదా మార్చుకొని మనోహరమైన వేషంలో వచ్చినా రాము నకలా కనిపించకనైనా పోవాలి. ఇది వాల్మీకి చాలా ద్వంద్వార్థంగా ధ్వనింపజేశాడొక మాటలో. నహితావన్మ నోజ్ఞాంగీ - రాక్షసీ ప్రతిభాసితే - ఇది దాన్ని రాముడన్నమాట. దీనికి రెండర్థాలు చెప్పవచ్చు నీ వింతరూపసివిగా కనబడుతున్నావు. రాక్షసివిగా నాకు కనిపించటం లేదు అనైనా అర్ధమే నీవు అందంగా కనపడటం లేదంటే తప్పకుండా రాక్షసివే అనైనా అర్థమే. అసలది మనోజ్ఞమైన రూపంలోనే తన దగ్గరికి వస్తే రాక్షసివి కావని చెప్పవలసిన పనేమిటి రాముడికి. అందుచేత రాక్షసిగానే దర్శనమిచ్చిందన్న మాట. కామమోహిత కాబట్టి తొందరపడి ఆ పనిచేసి ఉంటుంది. అందుకే ఆయన తన రూపమెప్పటికీ ఇలాగే ఉంటుందని అసహ్యించుకొంటాడేమోనని అహం శూర్పణఖానామ - రాక్షసి కామరూపిణి నేను రాక్షసినైనా కామరూపిణిని నా రూపం చూచి భయపడవద్దు.
ఇలాంటి రాక్షసి రాముడి దగ్గరకి వచ్చింది. వచ్చి నీవేమిటి. చూస్తే తాపసుడిలా ఉన్నావు. భార్యతో ఉన్నావు. శరచాపాలు ధరించావు. నీవెవరు. ఎందుకిక్కడికి వచ్చావని అడుగుతుంది. అంతవరకు బాగానే ఉంది. అది రాక్షసి అని గ్రహించినా తొందరపడలేదు రాముడు. సవ్యంగా అడిగింది కాబట్టి సవ్యంగానే జవాబిచ్చాడు. ఋజుబుద్ధితయా సర్వమాఖ్యాతుముపచక్రమే అంటాడు వాల్మీకి. నిజాయితీతో ఏది దాచకుండ ఉన్న విషయం చెప్పాడట. ఋజుబుద్ధి అనే మాట ఇక్కడ గమనించదగిన మాట. తన కథ అంతా సంగ్రహంగా చెప్పాడు దానికి. చెప్పి నీవెవరు ? ఎందుకిక్కడికి వచ్చావు అని దాన్ని మరలా ప్రశ్నిస్తాడు. అది కూడా ఉన్న విషయమే చెబుతానని చెబుతుంది. రావణుడు నా అన్న అతడిపేరీపాటికి నీ చెవికి కూడా వచ్చి ఉండవచ్చు. కుంభకర్ణుడని ఒక సోదరుడు. నిద్రాళువు. విభీషణుడని ఇంకొక భ్రాత. రాక్షసుడైనా రాక్షస స్వభావుడు కాడు. ధర్మాత్ముడు. మరి ఖరదూషణులని మరి ఇద్దరు సోదరులున్నారిక్కడే ఇంతవరకూ బాగానే మాట్లాడుతూ వచ్చింది. ఇక్కడ నుంచే చెడింది దాని వ్యవహారం. వాళ్లనందరినీ విడిచి వచ్చాను. నీ రూపమపూర్వంగా కనిపిస్తే మోహించాను. నన్ను పెండ్లాడు. నాకు చాలా శక్తులున్నాయి. నేనే నీకు తగినదాన్ని. సీతాయా కిం కరిష్యసి - ఈ సీతతో ఏమి చేస్తావు. వికృతాచ విరూపాచ-
Page 182