#


Index

ధర్మ సూక్ష్మములు

పేరు ప్రతిష్ఠలున్నవాడు. అదా ఒక ఊరు పేరు లేని గయ్యాళి రాక్షసి. దానితోనా వేళాకోళాలు, అబద్ధాలు, రామో ద్విర్నాభిభాషతే - సత్యవాక్యోజితేంద్రియః అనృతం నోక్త పూర్వం మే నచవక్ష్యేకదాచన రాముడు రెండుమాటలు మాట్లాడడు. అతడేది మాట్లాడినా నిజమేతప్ప అబద్దం మాట్లాడడు అని గదా మొదటి నుంచీ తనకు పేరు. అలాంటివాడు ఆ దానవితో ఎలా ఆడాడబద్ధం. ఏమిటా అబద్ధం. కృతదారోస్మి భవతి - భార్యే యందయితా మమ - అనుజస్త్వేషమే భ్రాతా - శ్రీ మానకృత దారశ్చ - లక్ష్మణోనామ వీర్యవాన్ అనురూపశ్చతే భర్తా - రూపస్యాస్య భవిష్యతి ఏనంభజ విశాలాక్షి భర్తారమ్ - అమ్మ నేను పెండ్లయన వాడను. నాకు నా భార్య అంటే చాలా ఇష్టం. నీవా సవతి పోరు భరించలేవు. ఇడుగో నా తమ్ముడు లక్ష్మణుడు. నీకు తగినవాడు. వాడికింకా పెండ్లి కాలేదు. వాణ్ణి పోయి పెండ్లాడు చక్కగా ఉంటుందంటాడు. పైగా వాడు పెండ్లాంకోసం పరితపిస్తున్నాడట. ఏమిటీ మాటలు. రాముడంత వాడనవలసినవా. పచ్చి అబద్దం కదా. అంతేకాదు. తాను దానితో ఇంతగా హాస్యమాడి అలాంటి హాస్యమే తమ్ముడు కూడా ప్రయోగించాడని చెప్పి వాణ్ణి మందలిస్తాడు మరలా, క్రూరై రనార్యైస్సౌమిత్రే - పరిహాసః కథంచన నకార్యః పశ్యవైదేహీం - కథం చిత్సౌమ్య జీవతీమ్ పనికిరాని హల్కామనుషులతో చదురులాడరాదు. చూడు సీతను చంపుతానని వచ్చి పైన బడుతున్నది. దీన్ని ముక్కు చెవులు కోసి పంపమని కోపంతో అంటాడు. ఇదీ వరస. ఇదెంత బాగుందో చూడండి ఈ వ్యవహారం. దీన్ని ఎలా సమర్థిస్తారని ప్రశ్న.

  ఇది కూడా ముందు వెనుకలు చూడకుండా తొందరపడి చేసే విమర్శే. అసలు జరిగిన విషయం చక్కగా పరామర్శించి చూస్తే మనమిలా విమర్శ చేయలేము. జరిగినదేమంటే రాముడు సీతా లక్ష్మణ సహితుడై పర్ణశాల ముందు కూచొని ఏవో కథలు చెప్పుకొంటున్నారు. అలాంటి సమయంలో వచ్చిందా శూర్పణఖ. అదీ యాదృచ్ఛికంగా వచ్చి రాముణ్ణి చూసింది. చూడగానే అతిలోకమైన ఆ సౌందర్యానికి మోహించింది. తానెలాంటిది. ఏమైనా సౌందర్యవతా. కాదు. సుముఖమ్ దుర్ముఖీ ప్రీతిరూపం విరూపా - తరుణం దారుణావృద్ధా అతడు మంచి అందగాడైతే తాను కోతి. అతడు యువకుడైతే తాను ముసలి తొక్కు పోనీ మాటయినా నాజూకుగా ఉందా అంటే దక్షిణం వామభాషిణి అతడు చక్కగా మాటాడేవాడైతే తనవన్నీ వక్రపు

Page 181

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు