చూడండి. రాముడనే మాటలు కావివి. ఆత్మారాముడనే మాటలు చాపక్రింది నీళ్లలాగా ఉన్నట్టుండి లక్ష్మణుడికే పెట్టాడు పరీక్ష. అయోధ్యకు పోవాలట అతడు. ఎందుకు ? తల్లులను ఆదుకోవటానికి. ఏమి వచ్చింది వారికి. భరతుడి తల్లి కైక వారిని బాధపెడుతుందట. ఏమి ? ఎందుకు పెడుతుంది. ఆవిడ శీలమలాంటిది. క్షుద్ర స్వభావురాలావిడ. చూడండి. అప్పుడు తండ్రిని తిట్టాడు. ఇప్పుడు తల్లిని తిట్టాడు. తండ్రిలో ఒక దోషమైతే తల్లిలో మరొక దోషం అతడిలో కాముకత్వం ఆవిడలో క్షుద్రత్వం. రెండూ శిక్షకు పాత్రమయినవే. దానికి శిక్ష తన వియోగం. మరి దీనికో ? దీనికి లోకాపవాదమే. వసిష్ఠుడి దగ్గర నుంచి నలుగురూ ఆవిడను బ్రువ్వదిట్టటమే. కడకు ఆవిడ కొడుకు గూడా అలా జరగాలనే ఆ కొడుకు కాళ్లావేళ్లా పడి బ్రతిమాలినా మరలా అయోధ్య గడప దొక్కనని భీష్మించుకొన్నాడు తాను. మరి ఇందులో లక్ష్మణుడికి పెట్టిన పరీక్ష ఏమిటి ? ఇలా భయపెట్టి చూస్తే నిజమేనని వాడయోధ్యకు వెళ్లుతాడని. వెళ్లాలని కూడా కాదు. వెళ్లుతాడా లేదా చూద్దామని వెళ్లాడో తనమీద భక్తిలేదని తెలపవచ్చు. వెళ్లడో తల్లిదండ్రుల మీద లేదని చాటవచ్చు.
అతడేమి తక్కువవాడా ? ఒక్కటేమాట అన్నాడతను. నచసీతా త్వయాహీనా నచాహమపి రాఘవ ముహుర్తమపి జీవావో జలేమత్స్యావివోద్ధృతా నహితాతంన శత్రుఘ్నం - నసుమిత్రాం పరంతప ద్రష్టుమిచ్ఛేయ మద్యాహం స్వర్గం వాపిత్వయావినా - నీవు లేకుండా నేనుగాని సీతగాని బ్రతకలేము. నీళ్లలోనుంచి బయటపడ్డ చేపలమాదిరవుతాయి మా బ్రతుకులు. నాకు తల్లినిగాని తండ్రినిగాని, శత్రుఘ్నుణ్ణిగాని ఎవరిని చూడాలనిలేదు. చివరకు స్వర్గమైనా నీవు లేకుండా నాకక్కరలేదని తెగవేసి చెబుతాడు. అంటే అంతకు ముందొక మాట అంటాడు రాముడు. ఏకోహ్యహమయోధ్యాంచ - పృథివీంచాపి లక్ష్మణ తరేయమిషుభిః క్రుద్దో - ననుశౌర్యమ కారణమ్ అధర్మ భయ భీతశ్చ - పరలోకస్య చానఘ - తేనలక్ష్మణ నాద్యాహ - మాత్మానమభిషేచయే నాకు నిజంగా కోపమే వచ్చిందంటే లక్ష్మణా ! అమోఘమైన నా బాణాలతో అయోధ్యనేమిటి ? మొత్తం భూమండాలన్నే రూపుమాపగలను. కాని అంత క్రోధమిప్పుడనావశ్యకం. ఇహపరాల్లో అధర్మం దొర్లుతుందనే భయంతో బలవంతంగా నేను పట్టాభిషేకం చేసుకోవటాని కిష్టపడటం లేదు తెలుసా అంటాడు. అనటమే కాకా అయ్యో నాతల్లి కౌసల్య
Page 178