#


Index

ధర్మ సూక్ష్మములు

కాదు. అర్ధ ధర్మాలకన్నా మిన్నగా కామాన్నే సేవించటమధర్మం. అది రాజైన వాడి కేమాత్రమూ తగదు. అలాంటి తగని పని చేశాడు తండ్రి. తండ్రి అయినా అలా చేయటమనుచితమే. అనుచితం గనుకనే శిక్షకు పాత్రుడు. ఏమిటా శిక్ష మయాచైవ వినాకృతః అనే మాటలో మన్యే దశరథాంతాయ అనే మాటలో సూచితమవుతున్నది. నేను దూరమై పోవటమే ఆయనకు నేను విధించిన శిక్ష. తనకు దూరమైతే ఏమవుతాడు. అంతమై పోతాడు. కాముకుడు బ్రతుకకూడదు. బ్రతికినా అది పనికిమాలిన బ్రతుకే. కామాన్ని అసలు సేవించగూడదని కాదు. ధర్మావిరుద్ధోభూతేషు కామోస్మి అని కృష్ణభగవానుడు చెప్పినట్టుగా ధర్మావిరుద్దంగా సేవించాలది. అలా సేవించలేదిప్పుడు దశరథుడు. అందుచేత తన వియోగానలాని కాయన జీవితం ఆహుతై పోవలసిందే తప్పదు. పరమాత్మగా తను విధించే శిక్ష ఇదే జీవుడికి.

  కాబట్టి రాముడు చూచారా తండ్రినెంతగా దూషించాడో అని కాదు మనం చూడవలసింది. తండ్రి ఏమిటి తల్లి ఏమిటి పరమాత్మకు. ఎవరైనా తప్పుచేస్తే దూషించవలసిందే. శిక్షించవలసిందే. అయినా మానవోచితంగా కూడా వ్యవహరించ వలసిన వాడు కాబట్టి తండ్రిగా నలుగురిలో బయటపెట్టక ఆయన మర్యాద దక్కించాడు. జీవుడుగా తన వనగమన చర్యవల్ల శిక్షించాడు. ఎందుకు శిక్ష విధించాడో తెలపటం కోసం లక్ష్మణుడితో ఒక్కడితో మాత్రం బయటపడి అన్నాడు. అలా అనటంలో కూడా కామైక పర్వతమనేది ముప్పు తెస్తుంది ఎవరి జీవితానికైనా కబర్దారని లోకానికి భంగ్యంతరంగా చాటటానికేనని అర్థం చేసుకుంటే చాలు. ఇక ఆక్షేపణ చేయబోము మనం. అంతేకాదు భంగ్యంతరమన్నందు కింకా ఒక చమత్కారముంది రాముడి మాటలలో, క్షుద్రకర్మాహికైకేయీ - ద్వేషాదన్యాయ్య మాచరేత్ కౌసల్యాం చ సుమిత్రాంచ - సంప్రబాధేత మత్కృతే - పాపిష్ఠురాలు కైక ఎంతకైనా సాహసిస్తుంది. నా తల్లిని నీ తల్లినీ సందు చూచుకొని ఎంత గాసిపెట్టినా పెట్టవచ్చు. ఎందుకైనా మంచిది అయోధ్యామిత ఏవత్వం - కల్యేప్రవిశ లక్ష్మణ అహమేకోగమిష్యామి - సీతయా సహదండకాన్ - అనాథాయాహినాదస్త్వమ్ కౌసల్యాయా భవిష్యసి - లక్ష్మణా ! నీవు రేపు ఉదయమే అయోధ్యకు వెళ్లిపో. నేను సీతా ఇద్దరము దండకారణ్యానికి వెళ్లతాము. నీవు వెళ్లితే తల్లికి రక్షగానైన ఉంటావంటాడు.

Page 177

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు