#


Index

ధర్మ సూక్ష్మములు

లోకంలో ఎవరికున్నా పనికిరాదు. ముఖ్యంగా దేశమేలే రాజుకు. తనకే గాక రాజ్యానికే ముప్పు తెస్తుంది. అధర్మం చర్యకు దారి తీస్తుంది నలుగురిలో నవ్వులపాలు చేస్తుంది.

  ఇదుగో ఈ అధర్మం అతనిలో ఉందటం పరమాత్మగా తాను సహించలేక * పోయాడు రాముడు. ఎంత పెద్దవాడైనా పరశురాముణ్ణి లాగా అతణ్ణి శిక్షించవలసిందే. అయితే పరశురాముడంటే పరాయివాడు. బ్రహ్మణుడయి కూడా కర్కశమైన క్షాత్ర ధర్మ మవలంబించి అనుచితంగా అనేకమందిని వధించి అందరి సానుభూతిని కోలుపోయాడు. పైగా పెండ్లి కుమారుడని కూడా చూడకుండా తన్ను దారిలో అడ్డగించాడు. కయ్యానికి కాలు దువ్వాడు. అలాంటివాణ్ణి నిగ్రహించినా చుట్టూ ఉన్న వారేరమనుకోరు. పైగా తగిన పాఠం చెప్పాడని మెచ్చుకొంటారు. ఇక్కడ అలా కాదు. ఇతడు తండ్రి హోదాలో ఉన్నాడు. అతడు కాముకుడో ధార్మికుడో వ్యక్తిగతమైన ఆ స్వభావం ప్రజలకు తెలిసేది కాదు. వారికది అక్కరలేదు. పైగా కైక తండ్రికి మాట ఇచ్చిన రాజరహస్యమెవ్వరికీ తెలియదు. అలాంటి సందర్భంలో తండ్రి చేసిన చర్య నలుగురిలో ఎలా బయటపెట్టటం. ఆయనను నలుగురిలో నిలదీసి అడగటం గాని నీవు చేసింది తప్పని చాటటంగాని అసందర్భం. నలుగురి దృష్టిలో ఆయన ఇంకా పలచనయిపోతాడు. అది తనకే అవమానకరం. తండ్రిని గౌరవించటం తనయుడిగా తన కర్తవ్యం. అయితే ఆయనలో ఒక దోషమున్నది. ఒక దౌర్బల్యమున్నది. దానికి మాత్రం తగిన దండన విధించాలి. కాని అది పదిమందిలో బాహాటంగా చేయరాదు. లోకానికాదర్శంగా తన పుత్ర ధర్మాన్ని తను పాటించాలి. తనకు లోపల దేవుడనే జ్ఞానమున్నా జీవుడి మాదిరే నడుచుకోవాలి పైకి కనుక అలాగే నడుచుకొన్నాడు. అయోధ్యలో ఉన్నంతవరకూ పైకి తేలలేదు. పల్లెత్తుమాట అనలేదు. పరిస్థితులెప్పటికప్పుడెలా మారుతున్నా ఉలకలేదు. పలకలేదు. మౌనంగా చూస్తూ చేస్తూ వచ్చాడు.

  కాని అంతమాత్రం చేత తండ్రి చేసింది అధర్మం కాకపోదని తెలుసు రాముడికి. పదిమందిలో కాకపోయినా ఎక్కడో ఒక చోట అది బయట పెట్టి తీరవలసిందే. తగిన శిక్ష ఆయనకు తాను దేవుడుగా విధించవలసిందే. అందుకే అక్కడ ఎక్కడా గాక అడవిలో ఏకాంతంగా ఎవరూ వినకుండా ఒక్క లక్ష్మణుడితోనే అన్నాడీ మాటలు. ఈ మాటలు మనమిక్కడ దేవుడి హోదాలో అర్ధం చేసుకోవాలి. జీవుడి హోదాలో

Page 176

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు