వచ్చాడు. అయితే ఒక్క విషయం. కృష్ణుడిలాగా రాముడు బయటపడి విధించడా శిక్ష, చాటు మాటుగా చేస్తాడు. ఏమి కారణం. భగవంతుడీ అవతారంలో మానవుడుగా జన్మించినా తాను దేవుడనుకోవటంలేదు. మానవుడనే భావిస్తున్నాడు. అందుచేత నలుగురికీ మానవుడు చేసినట్లుగానే చేయాలి. ఏది చేసినా చేసినట్లు చెప్పినట్లు కనిపించరాదు. అనిపించరాదు.
ప్రస్తుతమిక్కడ అలాగే జరిగింది వ్యవహారం. దశరథుడు చేసింది అక్షరాల తప్పు. అతడు కైక తండ్రికి చేసిన వాగ్దానమే ముప్పయింది. వెనుక ముందు ఆలోచించకుండా ఆ రాజలా మాట ఇవ్వకూడదు. ఇచ్చిన వాడిక పుత్రకామేష్టి కుపక్రమించరాదు. ఉపక్రమించినా ఆ ప్రాజాపత్యుడిచ్చిన పాయసాన్ని రాణులందరికి పంచిపెట్టక కేవలం కైకకే ఇచ్చి ఉండవలసింది. కైకకే ఇచ్చి ఉంటే ఆవిడకే పుత్రుడు జన్మించి వాడే జ్యేష్ఠుడై రాజనీతి ననుసరించి వాడికే రాజ్యం లభించి ఉండేది. నీతి తప్పినాడన్న అప్రతిష్ఠకు గురి అయ్యేవాడు కాదు. అలా కాక అందరికీ పంచిపెట్టేసరికి ముందుగా రాముడు జన్మించి జ్యేష్ఠుడయి కూచున్నాడు. భరతుడు తరువాత పుట్టి అతనికి తమ్ముడయ్యాడు. రాజ్యమిప్పుడితనికివ్వటమా ? అతనికివ్వటమా ? జ్యేష్ఠుడని ఇస్తే మాట తప్పిన వాడవుతాడు. మాట నిలబెట్టుకుంటే రాజనీతికి జలాంజలి ఇచ్చినవాడవుతాడు. అయితే ఇప్పుడేమి చేశాడు. కైక కొడుకుకే కట్టబెట్టాడు రాజ్యం. ఏమి కారణం. జ్యేష్ఠడైనా రాముణ్ణి కాదని వాడికే ఇవ్వవలసిన కారణమేమి. మాట నిలబెట్టుకోటానికంటావా ? ఏదో ఒకటి వదులుకోవలసినప్పుడు మాటనే వదులుకొని రాజనీతినే పాటించవచ్చు గదా ! ఇక్కడే ఉంది రహస్యం.
దశరథుడు ముదుసలి అని పేరేగాని అతడు మొదటినుంచీ కాముకుడు. కాంతాలోలుడు. రాముడు మాదిరి ఏకపత్నీవ్రతుడు, జితేంద్రియుడు కాడు. ఆ కాముకమైన స్వభావంతోనే కైకను చేసుకొన్నాడు. బరవసాగా మాట ఇచ్చాడు. మరలా పుత్రకామంతోనే ఇష్టి చేశాడు. పాయసమందరికి అమాయికంగా పంచి ఇచ్చాడు. చివరకు దాని ఫలితం విషమించేసరికి కామంతోనే కైకకు వశుడయిపోయి కులక్రమాగతంగా రాముడికి చెందవలసిన రాజ్యమతణ్ణి కాదని భరతుడికి కట్టబెట్టాడు. అది మరలా బాహాటంగా బయటపెట్టలేక బాధపడుతూ వచ్చాడు. ఈ విషాదగాధ కంతా మూలమేదో గాదు. ఆ వృద్ధరాజు కామపర్వతమే. స్త్రీ లోలత్వమే. అది
Page 175