#


Index

ధర్మ సూక్ష్మములు

ధర్మ సూక్ష్మములు

  మనమింతవరకూ కథానాయకుని ధర్మతత్పరతను గూర్చి చర్చించాము. సమస్త ధర్మాలు కరగించి కరువుబోసిన విగ్రహమే శ్రీరాముడని ఎంతగానో కీర్తించాము. కాని ఎంత ధర్మచారిత్ర మనిపించుకొన్నదో ఆ పాత్ర అంత ధర్మదూరమనే విమర్శలకూ ఆక్షేపణలకు కూడా పాత్రమయింది లోకంలో. మనం ఉత్తమ ధర్మాలని రాముడిలో ఎత్తి చూపిన వాటినే ధర్మాభాసలని కొందరు వేలెత్తి చూపుతున్నారు. మీదు మిక్కిలి ఉదాత్త నాయకుని కుండవలసిన లక్షణాలక్కడక్కడ కొరవడ్డాయని కొన్ని బలహీనతలను కూడా అంటగడుతున్నారు. ఇలాంటి అధిక్షేపాల నన్నింటినీ పరిమార్జన చేసి క్షేత్రాన్ని నిష్కంటకం చేసేంతవరకూ మహర్షి అతిలోకంగా సృష్టించిన ఆ పాత్రకు విశిష్టత అలా ఉంచి శిష్టత లేని పరిస్థితి ఏర్పడుతుందసలు. అందుచేత ఇప్పుడా చేసే ఆక్షేపణలేవో ఎలాంటివో తెలుసుకొని వాటికి మనం చేయగల పరిహారమేమిటో ఆలోచిద్దాము.

  చిల్లరమల్లరవలా ఉంచి చూస్తే చెప్పుకోదగిన ఆశంకలు నా దృష్టిలో ఆరే ఆరు కనిపిస్తున్నాయి. అందులో మొదటిది రాముడు సీతా లక్ష్మణ సమేతంగా అడవికి వెళ్లిన తరువాత మొదటి రోజు రాత్రి అక్కడ నిద్ర పట్టక ప్రక్కనే ఉన్న లక్ష్మణుణ్ణి చూచి తన తండ్రి దశరథుణ్ణి గూర్చి అన్న మాటలు. అవి ప్రశంసిస్తూ అన్న మాటలు కావు. అధిక్షేపిస్తూ, కోహ్యవిద్వానపి పుమాన్ ప్రమదాయాః కృతేత్యజేత్ ఛందానువర్తినమ్ పుత్రమ్ తాతో మామివ లక్ష్మణ అర్ధదర్మౌ పరిత్యజ్య యః కామమనువర్తతే ఏవమాపద్యతే క్షిప్రమ్ - రాజా దశరధో యథా అనాథశ్చహివృద్ధశ్చ మయాచైవ వినాకృతః కింకరిష్యతి కామాత్మా - కైకేయ్యా వశమాగతః మన్యేదశరథాంతాయ మమ ప్రవ్రజ నాయచ - కైకేయీ సౌమ్యసంప్రాప్తా - రాజ్యాయ భరతస్యచ లక్ష్మణా చూడు. ఎంత మూర్ఖుడైనా ఒక తండ్రి ఆడదాని మాటలు విని గుణవంతుడైన పుత్రుణ్ణి అడవులపాలు చేసేవాడుంటాడా ? ఒక మన తండ్రి దశరథుడు తప్ప. అర్థ ధర్మాలు రెండూ గాలికి వదిలేసి కామమే పురుషార్థమని ఎవడు గట్టిగా పట్టుకొంటాడో వాడు దశరథుడిలాగే దెబ్బ తింటాడు అయినా

Page 173

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు