నిర్దాక్షిణ్యంగా పరిత్యజించాడు. ప్రజలకోసం తన వ్యక్తిగత సౌఖ్యాన్ని కూడా కాలదన్నాడంటే ఇంతకన్నా రాజ ధర్మపాలనా పారతంత్య్రమేముంది చెప్పండి. ఇలాంటి ధైర్యసాహసాలు సంసిద్ధతా ఉన్నవాడు గనుకనే మొదటినుంచీ సమయం వచ్చినప్పుడల్లా యదివా జానకీమపి నా జానకినైనా సరే వదలుకోటానికి వెనుదీయనని ఒకమాట అంటూ వస్తాడు. ఏ వేళ ఏ నోట అన్నాడో గాని అది అలాగే ఫలించింది.
ఇక రెండవది శంబూకవధ. వర్ణాశ్రమ ధర్మాలనేవి శాస్త్రచోదితం అవి
మానవులంతా ఏ కాలంలోనైనా ఏ రాజ్యంలోనైనా పాటించి తీరవలసిందే. అప్పుడే
అది సౌరాజ్యం. లేకుంటే ధర్మసాంకర్యమూ విప్లవమూ ఏర్పడి అస్తవ్యస్తమై పోతుంది
లోక వ్యవస్థ. అదే మానవజాతికి వినిపాతం. చివరకు జగత్ప్రళయం. అలాంటిఅనర్ధం
నివారించాలంటే ధర్మమనేది నాలుగుపాదాలతో నడవాలి. నడవాలంటే అది నడిపే
రాజును బట్టి ఉంటుంది. యథారాజా తథాప్రజాః పాలకులను బట్టే పాలితులు.
రౌతు మెత్తనైతే గుఱ్ఱం మూడు కాళ్లతోనే నడుస్తుంది. లేదా అసలు నడవనే నడవదు.
అది ఏదో అత్యాహితానికి కూడా దారి తీయవచ్చు. అలాగే తీసింది శంబూకుడి
వ్యవహారం. వాడొక శూద్రుడు. తపస్సు చేయటం వాడి ధర్మంకాదు. అయినా
చేశాడు. అందులోనూ ఏదో కామ్యం మనసులో పెట్టుకొని చెట్టుకొమ్మకు తల్లక్రిందుగా
వ్రేలాడుతూ క్రింద ధూమపానం చేస్తూ తపస్సు సాగించాడు. ఇది ఒక ఆభిచారిక
హోమంలాంటిది. దారుణమైన ఈ చర్య రాజ్యంలో ఎక్కడో ఒక విప్రకుమారుడి
ప్రాణాలు తీసింది. అతడు వచ్చి రాముడితో మొరపెట్టాడు. వెంటనే ఖడ్గంచేత
పట్టాడు రాముడు. పుష్పకమెక్కి రాజ్యం నలుదెసలా అన్వేషించాడు. శూద్రతపస్వి
కంటపడ్డాడు. వాడికంఠ మా ఖడ్గంతో కరుక్కున త్రెంచాడు. వెంటనే ఆ బాలుడు
లేచి కూచున్నాడు. ఇదీ ధర్మపాలనమంటే. పోతే లక్ష్మణుణ్ణి చంపట మిష్టంలేక
దేశ బహిష్కృతుణ్ణి చేయటంకూడా ఆయన రాజధర్మ పాలనకొక కఠినమైన పరీక్షే.
ఈ విధంగా చెబుతూ పోతే ఎంతైనా ఉంది. మొత్తంమీద రాముడి ధర్మపాలన
అనన్యా దృశమైనది. లోకోత్తరమైనది. శిష్యధర్మం దగ్గర నుంచి రాజధర్మం వరకూ
దాని విరాడ్రూపాన్ని దర్శించవచ్చు ఆయన జీవితంలో. ధర్మమే రాముడు-రాముడే
ధర్మమన్నంతగా ధర్మాన్ని పాటించిన పాలించిన మహానుభావుడాయన.
రామో విగ్రహవాన్ ధర్మః
Page 172