#


Index

ధర్మపాలనము

సీతాంచోరవద్వ్యపకర్షతః శూరుణ్ణి వీరుణ్ణి అని చెప్పుకొంటున్నావు. సిగ్గు లేదా నీకు దొంగలాగా నేను లేని సమయంలో సీత నపహరించి తెచ్చావు. యదిమత్సన్నిధౌ సీతాధర్షితాస్యాత్త్వయా బలాత్ నా సమక్షంలోనే ఆ పని చేసి ఉంటే నీవీపాటికి భ్రాతరంతు ఖరంపశ్యే స్తదామత్సాయకైర్హతః నా బాణాగ్ని కాహుతి అయి నీ తమ్ముడు ఖరుణ్ణి పోయి కలుసుకొనేవాడివి. రావణుడి బ్రతుకంతా బయటపెట్టాడీ మాటల్లో.

  ఇక్కడ ఒక రహస్యం గ్రహించాలి మనం. మోసంతో చేసిన కార్యాన్ని మోసంతో సాధించటమిష్టం లేదు రాముడికి. ఇది గొప్పవీరుడికుండే గొప్ప లక్షణం. అది సీతా లక్ష్మణాదులందరికీ తెలుసు. ఆ మాటకు వస్తే రావణుడికి కూడా తెలుసు. హనుమంతుడు సీతను తానే తీసుకెళ్లుతానంటే ఆవిడ వద్దని చెప్పింది ఇందుకే. అది జగదేకవీరుడైన రాముడికి శోభనివ్వదంటుందావిడ. అమ్మా అలాంటి వీరపత్నివి నీవనవలసిన మాటే నంటాడు హనుమంతుడు. ఇలాంటిదే మరొక సన్నివేశం యుద్ధానంతరం ఏర్పడుతుంది. రావణ వధానంతరం సీతను తీసుకు రమ్మని హనుమంతుణ్ణి పంపుతాడు రాముడు. ఆవిడ తన ఎదటికి రాగానే ఇలా అంటాడు. దైవికంగా వచ్చిపడిన ఉపద్రవాన్ని మానుషమైన బలపరాక్రమాలతో నేను త్రిప్పికొట్టాను. అది నీ కోసం కాదు. నా పౌరుషాన్ని నిలబెట్టటం కోసం. దీని మూలంగా నాకు కలిగిన అవమానం నా శత్రువుతోపాటే అంతమయింది. నా మనసు తేలికపడ్డది. రాముడి వీరగుణానికిది ఒక విధంగా పరాకాష్ఠ. అంతేకాదు. ఉత్తర కాండలో రావణుడి గుణగణాలను ప్రశంసిస్తూ మహర్షులవల్ల అతని పూర్వ చరిత్ర వినగోరటంలో సాటి వీరులయెడ ఆయనకు గల అభినందనగుణంకూడా తేటపడుతుంది.

  పోతే ఇక ఆఖరిది రాజధర్మం. ఇది మనకు రామాయణోత్తర భాగంలో బ్రహ్మాండంగా వ్యక్తమవుతుంది. రామరాజ్యమని పేరు. ఏ ఆదర్శ రాజ్యానికైనా అప్పటికీ ఇప్పటికీ ఆ మాట సార్థకం. అసలు యుక్త వయస్సు వచ్చినప్పటినుంచీ రాజలక్షణాలకు కూడా ఆయనతోపాటే వయసు పెరుగుతూ వచ్చింది. దశరథుడది గమనించే ఆయనకు యౌవ రాజ్యాభిషేకం చేయాలని చూచాడు. ప్రజాభిప్రాయం అడిగాడు. వారందరూ ఏకగ్రీవంగా అందుకనుమోదించారు. రాముడిలో ఉండే గుణగణాలెంతగానో వక్కాణించి చివరకు ఆయనను మించిన రాజు మరొకడుండ బోడని తీర్మానించారు. దశరథుడు మరలా రాముని పిలవనంపి మాట్లాడుతూ అద్యప్రకృతయస్సర్వాః త్వామిచ్ఛంతినరాధిపమ్ - అతస్త్వామయువరాజాన

Page 170

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు