#


Index


ఆలోకనము

రామాయణాల్లోను పౌరాణికులు లోకాభి రామాయణాల్లోనూ. ఇలాగే సాగితే కొన్నాళ్లకివే రామాయణమై అసలు రామాయణం మారాయణమై పోగలదు.

  అనలిన్ని రామాయణాలెందుకు రచించినట్టు. వాల్మీకి రచించింది రామాయణం కాదా. అందులో రాముని వృత్తాంతం పూర్తిగా లేదా రామాయణమంటేనే రాముడి కథ. అది నిరవశేషంగానే వ్రాశాడు మహర్షి. జననం మొదలు నిర్యాణం దాకా ఏడుకొండల కథాఎంతో విపులంగా రచించాడు. మరి క్రొత్తగా ఒకరు రచించవలసిన ఆవశ్యకత ఏమిటి అందులో ప్రతిపాదించిన కథా వస్తువులో కొన్ని అవకతవకలు దొర్లాయి కాబట్టి వాటిని సవరించటానికైనా కావాలి. లేదా అలాంటి అవగుణాలేవీ లేకపోయినా అందులో దాగి ఉన్న రహస్యార్ధాలను పట్టుకొని బయట పెట్టటానికైనా కావాలి. ఇవి రెండూ కూడా అవిచారిత రమణీయమే. ఎందుకంటే అవకతవకలనేవి నీ దృష్టితో చూచి తలపోస్తున్నావేగాని అది అసలు సర్వాంగ సుందరమైన గొప్ప రచన. అరసి చూచే ఓర్పు నేర్పు లేక ద్రాక్షపండ్లు పుల్లన అంటున్నావు నీవు. పోతే దోషభూయిష్టమనటం లేదు మేము. సర్వాంగ సుందరమే కావచ్చు రచన. అందులోని సౌందర్య రేఖలనే మేము లోకానికి విప్పి చూపుతున్నామంటే అది మెచ్చదగిన మాటగాదు. అలాంటప్పుడా మాతృకనే వ్యాఖ్యానించి చూపాలి గాని దానికి తాము ప్రతిబింబాలను సృష్టించనక్కరలేదు. అది మూలకారుడి కంటే ఘనంగా మేము వ్రాశాము చూడండని లోకానికి తమ ఉత్కర్షను చాటినట్టవుతుందేగాని మూల సౌభాగ్యాన్ని ప్రదర్శించినట్టు గాదు.

  అందుచేత ఇంతకూ చెప్పవచ్చిందేమంటే వాల్మీకి రామాయణమే రామాయణం. ప్రప్రధమంగా ఆయనే రచించాడు దాన్ని అది ఆయన సృష్టి దానిని మార్చటానికి తీర్చటానికి మరెవరికి హక్కులేదు. అంత మేధాశక్తి ఉన్నవారు వేరొక కావ్యాన్ని సృష్టించుకోవచ్చు. దానిమీదనే సాము

Page 17

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు