బుధా భావసమన్వితాః అన్నట్టు విశుద్ధసత్త్వ సంపన్నమైన బుద్ధితో అంతకంతకు లోతుకు దిగి పూర్వాపరా లాకళించుకొని కావ్య తాత్పర్యమేమిటా అని వెదుకుతూ పోయామంటే సర్వము చక్కగా సమన్వితమై లోకోత్తరమైన ఆహ్లాదాన్ని మనకు ప్రసాదిస్తుంది. అలాంటప్పుడిక అధ్యాత్మ రామాయణమనీ, భావార్ధ రామాయణమనీ, కృత్తివాస రామాయణమనీ, రామచరిత మనసమనీ మరొకటని ఏ రామాయణాలు మనకక్కరలేదు. వాల్మీకి రామాయణ మొక్కటే చాలు.
కాకపోయినా వాల్మీకి రచించిన తరువాత మరలా ఇన్ని రామాయణాలు దేనికి. రామాయణాలన్ని వెలువడటంవల్ల రామాయణా లెక్కువయి అసలు రామాయణమేదో అర్ధం కావటంలేదు. అది అడుగున బడిపోయింది. దీనికి తోడు పౌరాణికులు కొందరు బహుకాలం నుంచి దానిని పురాణంగా లోకులకు బోధిస్తూ వారి బుద్ధుల నాకర్షించటం కోసమెన్నెన్నో ఉదంతాలు మూలంలో లేకున్నా అందులో చేరుస్తూ వచ్చారు. అంతెందుకు. వానరుల కెవరికీ గదలనేవి లేవు. నఖ దంష్ట్రా యుధులు వారు. అలాగే వర్ణించాడు వాల్మీకి. అయినా వారి కొక్కొక్కరి కొక్కొక్క గదా దండ మమర్చారు వీరు. వాలి సుగ్రీవులు గదా యుద్ధం చేయటం, హనుమంతుడు చేతిలో ఎప్పుడు ఒక బలమైన గద ధరించి ఉండటం, పౌరాణికులు తెచ్చిపెట్టినవి. అలాగే లక్ష్మణరేఖ అనేది లేదు రామాయణంలో. సీతను బలవంతంగా పట్టుకొనిపోయాడే గాని రావణుడు చుట్టూ నేల త్రవ్వి నెత్తిన బెట్టుకొని పోలేదు. బలవంతంగా తెచ్చాడనే చెబుతుంది సీత. మరి గుహుడు రాముని పాదాలు కడగలేదు. పెట్టలేదు. పడిపోయింది లేదు. విభీషణుణ్ణి రావణుడు కాలితో తన్నింది లేదు. అన్నీ అభూతకల్పనలే. ఇవి కల్పనలని గాక యదార్ధమనే నమ్ముతున్నారు లోకులు. అనేకులు పండితులు కూడా. ఇవన్నీ అవాల్మీకాలు అవాల్మీకమైనా మాతృకాశోభను పెంచేవైతే మంచిదే. అలాకాక దాని మహత్త్వాన్ని త్రుంచేవైతేనే మనకు బాధ. ఇలాంటి బాధలు చాలా ఏర్పడ్డాయి. నకిలీ
Page 16