#


Index

ధర్మపాలనము

పొడుగునా కాపాడుతూ వచ్చింది రాముడి కాయన పయినున్న అవ్యాజ కారుణ్యముద్ర ఒక్కటే.

  చిత్రమేమంటే తన ప్రభావంవల్ల అతడు కార్యాన్ని సాధించినా అతని సామర్ధ్యం వల్లనే అది తనకు సమకూడినట్టు భావించటం అతణ్ణి దీవించటం కృతం హనుమతాకార్యం - సుమహద్భువిదుష్కరం - మనసాపి యదన్యేన నశక్యం ధరిణీతలే హనుమంతుడు సాధించిన మహాకార్యం లోకంలో ఎవరూ సాధించలేదని ప్రశంసిస్తూ భృత్యుడి లక్షణాలు అందులో తరతమ భావాలు ఉగ్గడించి ఇలాంటి మహనీయుడు చేసిన ఉపకారానికి నేను ప్రత్యుపకారమేమి చేయగలనని మధన పడతాడు. ఏషసర్వస్వ భూతస్తు పరిష్వంగోహనూమతః అని అనన్య లభ్యమైన తన పరిష్వంగాన్ని ఆయనకు ప్రసాదిస్తాడు. ఉత్తరకాండలో కూడా ఆ వీర హనుమంతుడి సేవా ధర్మాన్ని వేనోళ్ల పొగడుతూ ఇలాగే అంటాడు రాముడు. మదంగే జీర్ణతామేతుయత్త్వ యోపకృతంకపే - నీవీ జీవితంలో గావించిన ఉపకారం నా యీ శరీరంలోనే జీర్ణించిపోవును గాక. నీకు మరలా నేనుపకారం చేయాలంటే నాలాగే నీ కొక కష్టం రావాలని కోరుకోటమే గదా అని చాల గొప్ప మాట అంటాడు స్వామి. రాముని స్వామి ధర్మమంటే ఇలాంటిది. ఈ మాటకన్నా విలువైన మనసుకు హత్తుకునే మాట ప్రపంచ వాఙ్మయంలోనే మరొకటి ఉండబోదంటే దానికి తిరుగులేదు.

  పోతే స్వామి ధర్మమైన తరువాత వీర ధర్మం. ఇది మనకు యుద్ధకాండలో తార్కాణమవుతుంది. అసలు యుద్ధమేమిటి. బాల నుంచి ఉత్తరదాకా ఎక్కడబడితే అక్కడ అవుతుంది. కశ్చవీర్యవాన్ అని గదా ప్రశ్నించాడు వాల్మీకి. వీరత్వమనేది రామచంద్రునికి ఆ జన్మసిద్ధం. సూర్యవంశజుడు! ఆదివిష్ణుని అవతారం. వీరత్వానికేమిటి లోపం. కాకపక్షధరుడయిన కాలంలోనే తాటకను వధించాడు. మారీచసుబాహులను పీచమడచాడు. శివధనుర్భంగం చేశాడు. పరుశురాముడికి గర్వభంగం చేశాడు. దండకారణ్యవాసులైన ఖరదూషణ త్రిశిరులను శిరశ్ఛేదం గావించాడు. దుందుభికాయాన్ని పదాంగుష్ఠంతో పారజిమ్మాడు. సప్తసాలాలను నిర్మూలించాడు. బలశాలి అయిన వాలిని ఒక్క కోలతో కూలనేశాడు. దారివ్వని సాగరాన్ని పూరి గరిపించాడు. ఇంత చేసిన మహావీరుడికి సంగ్రామ రంగంలో విజృంభించటమిక అసంభవమా ? రావణుడు కాదు. శతసహస్ర రావణులైనా

Page 167

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు