ఉందని గ్రహించి హనుమంతుడు గదా అని తెలిసి ఆలోచించాడట రాముడు. హనుమంతుడని తెలిసి ఏమిటి. ఏమో మనకేమి తెలుసు. ఆ స్వామికే తెలియాలి ఆభృత్యుడి వ్యవహారం. ధృవః కార్యఫలోదయః ఏ కార్యమైన ఫలించాలంటే ఇతడి విషయంలో తిరుగులేదని నిశ్చయించుకొంటాడు. ప్రహృష్టేంద్రియ మానసః అతణ్ని చూస్తుంటే మనస్సుకెంతో ఆహ్లాదమయిందట స్వామికి. వెంటనే అంగుళీయక మిచ్చి పంపుతాడు.
పంపటమే గాదు. మార్గమధ్యంలో అతడికెలాటి అవాంతరాలు జరగకుండా కాపాడినవాడు రాముడే. సురసా, సింహికా, లంకిణ్యాదులు సామాన్యులు కారు. అలాంటివారిని నిర్జించి లంకలో ప్రవేశించాడంటే హనుమంతుడు శ్రీరాముడి ప్రభావం వల్లనే. రామనామమే, రామస్మరణే అతనికి శ్రీరామరక్ష సర్వజగద్రక్ష గదా అది. జగద్ధితకరుడైన ఒక వానరుణ్ణి రక్షించక పోతుందా ? అతడే అంటాడు మహేంద్ర పర్వతం మీది నుంచి వినువీధికి లంఘిస్తూ. యథారామవ నిర్ముక్తశ్శరశ్శ్వసన విక్రమస్తద్వల్లంకాం గమిష్యామి - రామధనుర్విముక్తమైన బాణంలాగా అతివేగంగా ఆకాశంలో దూసుకుపోతాను. లంకలో ప్రవేశిస్తాను. హనుమంతుడంటే రామబాణమేనట. నిజమే మరి. రెండూ స్వామి వారి చేతిలోనివే. స్వామి బలంతో పనిచేసేవే. స్వామి కార్యాన్ని సాధించే సేవకులే.
మధ్యలో తనకు మైనాకుడాతిధ్యం చేస్తానన్నా తామసించలేదా సేవకుడు. త్వరతే కార్యకాలోమే - ప్రతిజ్ఞామయాదత్తా - నస్థాతవ్యమిహాంతరే. నీవేమి అనుకోకు. ప్రతినబూని వచ్చాను. స్వామి కార్యం నన్ను తొందర చేస్తున్నదని వెళ్లిపోతాడు. సురసతో కూడా అదే మాట అంటాడు. అన్ని విఘ్నాలూ తన స్వామి మహిమవల్లనే దాటగలుగుతాడు. అదృష్టంగా స్వామిహస్తం పనిచేస్తూనే వస్తున్నది. అది ఆ భృత్య భక్తుడెప్పుడో గ్రహించాడు. కనుకనే లంకలో ఎక్కడెక్కడో వెదకి అమ్మవారిని గానక చివరకు దూరంగా కానవచ్చే అశోకవనంలో ఉండవచ్చునని ఆశపడి సముహూర్త మివధ్యాత్వా - ఉదతిష్ఠన్ మహాతేజాః - ఒక్క క్షణం కండ్లు మూసుకొని ధ్యానం చేసి వెంటనే లేచి నిలుచుంటాడు. నిలుచొని నమోస్తు రామాయ సలక్ష్మణాయ అని రామమంత్రం జపిస్తాడు. ఆ మంత్ర బలమే పనిచేసి అమ్మవారి దర్శనం చేయగలుగుతాడు. మరలా వచ్చి రాముడికా ఉదంతం చెప్పగలుగుతాడు. దారి
Page 166