#


Index

ధర్మపాలనము

ఉన్నాడు సేనలను. వారు తిరిగి వచ్చిన తరువాత వచ్చి వార్త చెబుదామనుకొన్నాడు రాముడికి. అంతలోనే తొందరపడతాడు రాముడు. ప్రతిజ్ఞాయ హరీశ్వరః వ్యతీతాం శ్చతురోమాసాన్ - విహరన్నావబుద్ధ్యతే - ప్రతిన చేసి కూడా నాలుగు మాసాలు గడిచిపోయినా సరకు చేయక ప్రమత్తుడయి తిరుగుతున్నాడు దుర్మార్గుడు. లక్ష్మణా! నీవు పోయి ఇలా హెచ్చరించు ఆ కృతఘ్నుణ్ణి. నచసంకుచితః పంథా యేన వాలీహతోగతః సమయేతిష్ఠసుగ్రీవ - వాలి వెళ్లిపోయిన దారి ఇంకా మూతపడలేదు. సుగ్రీవా ! మాట నిలబెట్టుకో. ఒక్క వాలి మాత్రమే చచ్చాడు నా బాణంతో అప్పుడు. ఇప్పుడో నా బాణం నీ ఒక్కళ్లేగాదు నీ పరివారాన్నంతటినీ తుదముట్టిస్తుందని తెలుసుకో. చూడండి. ఎంత కఠినమైన మాటో ఇది. ఇంతకూ రాముడు మిత్రధర్మం పాటించటంలో ఎంత అనుగ్రహమో అంత నిగ్రహం కూడా చూపుతూ వచ్చాడప్పుడప్పుడూ.

  పోతే ఇక సుందరకాండలో ఆయన చూపింది స్వామిధర్మం. భృత్యుల విషయంలో స్వామిధర్మమే గదా చూపవలసింది. భృత్యులెవరు రాముడికి. అందరూ భృత్యులే నిజానికి. అయితే విశేషించి వానరులందరూ ఆయన భృత్యులు. ఆయన గారికి కైంకర్యం చేయటాని కాయారూపాలలో అవతరించిన దేవతలే గదా వారు. తమ కార్యం కోసమే ఆయనను సేవిస్తూ వచ్చారు. వానరులైనా అందుకే. వానర రాజైన సుగ్రీవుడైనా అందుకే. అయితే వారందరూ ఒక ఎత్తు. వాయుపుత్రుడైన హనుమంతు డొక ఎత్తు. వారు చిన్న పెద్ద మేడలు మిద్దెలైతే ఇతడన్నిటి కన్నా ఎత్తుగా పైకి లేచిన ఒక పతాకలాంటి వాడు. కిష్కింధలో స్వామిదర్శనం చేసుకొన్నది ప్రప్రథమంగా హనుమంతుడే. స్వామి దర్శనంతోనే భాగ్యవంతుడనయ్యాననుకొన్న హనుమంతుడు చరిత్రలో ఎన్నడూ చూడకపోయినా ఎన్నాళ్లనుంచో చూస్తూ ఉన్నంత భక్తి ప్రపత్తులు ప్రదర్శించాడు. ఎంతగానో ప్రస్తుతి చేసి ఆయన గారి ప్రశంస లందుకొన్నాడు. సుగ్రీవుడితో సఖ్యం చేయించాడు. రామకార్యం సుగ్రీవుడెక్కడ మరచిపోతాడో ఏమరి ప్రవర్తిస్తాడో నని మునుముందే అతణ్ణి హెచ్చరిస్తూ వచ్చినవాడు. అది మొదటి నుంచి కనిపెడుతూ ఉన్నాడా స్వామి. విశేషించి సుగ్రీవుడు తన ఎదుటనే అతణ్ణి కీర్తించటం గుర్తించాడు. తతః కార్యసమాసంగ మవగమ్య హనూమతి విదిత్వా హనుమంతంచ చింతయామాస కార్యమతడి వల్లనే నెరవేరవలసి

Page 165

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు