#


Index

ధర్మపాలనము

పారవేసిన దుందుభికాయాన్ని చూపుతాడు. దానిని తన పాదాంగుష్ఠంతో పారజిమ్ముతాడు రాముడు. చిమ్మితే అది పది యోజనాల దూరం పోయి పడుతుంది. రక్తమాంసాలెండిపోయిన శుష్కమైన కళేబరాన్ని చిమ్మి సుఖమేమిటంటాడు సుగ్రీవుడు. ఇదిగో చూడు. ఇటువైపు సప్తసాలాలు నిలిచి వున్నాయి. వీటిలో ఒకదాన్ని నీ బాణంతో మీటు చూతామంటాడు. ఒకటేమిటి. సప్త సాలాలనూ ఒక్క బాణంతోనే భేదిస్తాడు రాముడు. ఆ బాణ మా వృక్షాలనవలీలగా చీలగొట్టి నేలలో దూరి మరలా వచ్చి తూణీరంలో చేరిపోతుంది. దానితో ఆశ్చర్యచకితుడై సుగ్రీవుడు పాదాలమీద వాలిపోతాడు. రాముడతణ్ణి గాఢాలింగనం చేసుకొని కిష్కింధకు వెళ్లి వాలిని యుద్ధాని కాహ్వానించమని ఆదేశిస్తాడు. ఒకసారి యుద్ధంలో దెబ్బ తింటాడు సుగ్రీవుడు. _ రాముణ్ణి నిష్ఠుర మాడుతాడు రాముడంటాడు గదా. తతోహం రూపసాదృశ్యాన్మోహితః నోత్సహేహం శరమ్ మోక్తుమ్ - జీవితాంతకరమ్ - మూలఘాతోననః స్యాద్ధి త్వయివీరేవిపన్నేహి - దత్తాభయవధోనామ పాతకమ్ మహదుచ్యతే ఇద్దరూ ఒకేలా ఉండటం మూలాన బాణం విడవలేదు. ఏదైనా నీకు ప్రమాదం జరిగితే భరించగలనా? అది మొదలు చెడ్డ బేరమేగాక అభయమిచ్చి మిత్రుణ్ణి మృత్యుముఖంలో దోసిన వాడనుకానా అని ఒడ్డుకొంటాడు. మిత్రభావానికిది గీటురాయి ఈ మాట.

  తరువాత వాలి రాముడి బాణంతో నేలగూలి ప్రాణాలు విడవటం చూచి మరలా భరించలేకపోయాడు సుగ్రీవుడు. నా అంత నీచుడు భ్రాతృద్రోహి లేడని రాముడితో మొరపెడుతూ శోకిస్తాడు. అప్పుడు "ఇత్యేవమార్తస్య రఘు ప్రవీర శ్రుత్వా వచస్తస్య - సంజాతబాష్పః రామోముహూర్తం విమనాబభూవ” – మిత్రుడి విలాపం చూచి భరించలేక తానూ దుఃఖబాష్పాలు స్రవిస్తుండగా ఒక క్షణకాలం మనసు పని చేయక మౌనంగా ఉండిపోయాడు. సుగ్రీవుడంటే ఎంతటి సానుభూతో ఇక్కడ దాఖలా అవుతుంది. కష్టసుఖాలు రెండూ సమంగా పంచుకొంటేనే కదా మైత్రి అని పేర్కొన్నాము. అయితే ఒక్క మాట. రాముడెంతటి మిత్ర ధర్మం పాటించాడో అది ఆ మిత్రుడు నిలబెట్టుకొన్నంత వరకే. నిలబెట్టుకొనలేక మాట దప్పి కృతఘ్నడయి ప్రవర్తించాడో మరలా అతణ్ణి శిక్షించటానికి కూడా వెనుదీయడు. వర్షర్తువు వెళ్లిపోయినా శరదృతువు వచ్చి చాలా రోజులైనా సుగ్రీవుడు సీతాన్వేషణార్ధం వానరులను పంపటంలో జాగుచేస్తాడు. చేయలేదు వాస్తవానికి. అప్పటికే పంపి

Page 164

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు