#


Index

ధర్మపాలనము

కనుకనే సన్న్యాసివేషంలో ప్రచ్ఛన్నంగా వచ్చి మాట్లాడుతున్నా తీరా ఆయనను సమీపించే సరికా వేషానికి స్వస్తి చెప్పి తాను హనుమంతుడుగానే బయటపడతాడు. యువాభ్యాం సహ ధర్మాత్మా సుగ్రీవస్సఖ్య మిచ్ఛతి - మీతో మా సుగ్రీవుడు సఖ్యం కోరి నన్ను మీ దగ్గరకు పంపాడంటాడు. దానికి రాముడు సంతోషించి లక్ష్మణుడితో చూచావా మనతో స్నేహం చేయాలని సుగ్రీవుడే మన వద్దకు దూతను పంపాడితనితో మాటాడు. ఇతణ్ణి చూస్తే సామాన్యుడిగా కనపడటం లేదని ఎంతగానో ప్రశంసిస్తాడు. అతడు వారిని సుగ్రీవుడి దగ్గరకు చేర్చి అతనితో భవతాసఖ్యకామౌతౌ - భ్రాతరౌ నీతో మైత్రి కోరి వచ్చారీ అన్నదమ్ములంటాడు. సుగ్రీవుడప్పుడు సుందరమైన మనుష్య వేషం ధరించి రాముడితో నీ గుణగణాలు మా హనుమంతుడు చెప్పగా విన్నాను. తన్మమైవైషసత్కారో లాభశ్చైవోత్తమః ప్రభో యత్త్వమిచ్ఛసి సౌహార్ధం వానరేణ మయాసహ నీవీ వానరుడితో సఖ్యం కోరి వచ్చావంటే అది నాకే లాభం నాకే ఒక సత్కారమంటాడు. తిర్యక్కులతో కూడా సఖ్యం చేయాలనే రాముడి బుద్ధి తిర్యగ్జంతువులకే ఆశ్చర్యం కొలిపిందంటే చూడండి. అంతేకాదు. అన్యోన్యమభివీక్షంతౌ - నతృప్తి ముపజగ్మతుః ఒకరి నొకరు చూచుకొంటూ తనివి చెందలేదట వారు. త్వం వయస్యోసిమేహృద్యో - హ్యేకం దుఃఖం సుఖంచనౌ- మనమిద్దరమూ మిత్రులమయ్యాము. ఇకమీదట నీ సుఖదుఃఖాలు నావి నా సుఖదుఃఖాలు నీవి అనుకోవాలంటాడు రాముడు. ఉత్తమమైన మైత్రి సుఖదుఃఖాలు సమానంగా పంచుకోవటంలోనే ఉంటుంది. అనంతరం వాలి వల్ల జరిగిన పరాభవమంతా వినిపిస్తే సుగ్రీవుడు రాముడంటాడు. ఉపకార ఫలం మిత్రం విదితం మేమహాకపే మిత్రుడంటే ఒక కష్టంలో ఆదుకొనేవాడే నని నాకు తెలుసు. తప్పకుండా వాలిని వధించి నీకు మేలు చేస్తానంటాడు. ఇదే వాక్యమభిమానా - త్సమీరితం - అనృతం నోక్త పూర్వంమే - నచవక్ష్యే - కదాచన - ఎంతో అభిమానముంది నీ మీద నాకు. అందుకే ఇలాంటి ప్రతిజ్ఞ చేశానంటాడు.

  అప్పటికీ నమ్మలేకపోయాడు సుగ్రీవుడు. నమ్మలేక గాదు. వాలి పరాక్రమ మెంతటిదో తెలుసు అతనికి. రాముడి బలపరాక్రమాలా ఇంకా తెలియవు. అందుకే అవి తెలుసుకోవాలని కోరిక. తెలిసిందో ధైర్యం తప్పకుండా వాలిని చంపగలడని. అందుకే వాలి పూర్వ వృత్తాంతమంతా ఏకరువు పెడతాడు. అతడు వధించి దూరంగా

Page 163

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు