#


Index

ధర్మపాలనము

రాక్షసులు వచ్చి క్షతగాత్రులనే గాదు. హతగాత్రులనే చేస్తున్నారు. రాముడా పరిసరాలలో ప్రవేశించాడని తెలియగానే వచ్చి వారంతా మొరపెట్టుకుంటారు. నీవు క్షత్రియ వంశజుడవు. సకల ధర్మజ్ఞుడవు. అనాథులను రక్షించడం నీ కర్తవ్యం. నీలాంటివాడు రక్షకుడయి కూడా రక్షణలేక బ్రతుకుతున్నాము మేము. త్వంహి పశ్యశరీరాణి - మునీనాం భావితాత్మనాం హతానాం రాక్షసైట్హోరైః- కావలిస్తే నీవే వచ్చి చూడు ఎంత మంది మహర్షుల నా దుర్మార్గులు వధించారో వారి కళేబరాలెన్నెన్ని గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయో. నీవు వారి ఉపద్రవం నుంచి మమ్ములను కాపాడలేకపోతే మాకు వేరే శరణ్యం లేదని వాపోతారు. అలా వాపోతే ఇకమీదట ఇలాంటి దారుణమేదీ జరగకుండా చూచే పూచీ నాదని వారి కభయమిస్తాడు రాముడు.

  ఆ తరువాత సీత ఒకనాడు రాముణ్ణి చూచి ఇలా అంటుంది. ప్రతిజ్ఞాతస్త్వయావీర -దండకారణ్యవాసినా - మృషీణాం రక్షణార్థాయ - వధస్సంయతి రక్షసామ్ మీరు ఆ తాపసుల కోసం రాక్షసులందరినీ సంహరిస్తామని శపథం చేశారే. అది నాకేమాత్రమూ సరిపోలేదు. మీరిక్కడికి వచ్చింది తాపస ధర్మాన్ని సేవంచటానికి గాని క్రూరమైన క్షాత్ర ధర్మాన్ని సేవించటానికి గాదు. రాక్షసులతో మనకేమి వైరం. వైరం లేకుండానే వారిని వధించటానికి పూనుకోవటం నాకిష్టంలేదు. క్వచశస్త్రం - క్వచవనం - క్వచక్షాత్రం - తపః క్వచ - క్షత్రియులు చేయవలసింది ఆర్తత్రాణమనేది. మనమిప్పుడు క్షత్రియ వృత్తిలో లేము. తాపసవృత్తిలో ఉన్నాము. అందుచేత క్షాత్ర ధర్మాన్ని పాటించటం పనికిరాదని హెచ్చరిస్తుంది. దీనికి రాముడిచ్చిన సమాధానం చూడండి ఎలా ఉందో. త్వయైవోక్తమిదం వచః క్షత్రియైర్ధార్యతేచాపో - నార్తశట్టో భవేదితి దేవీ ! నీవే గదా అన్నావిప్పుడు క్షత్రియుడే ధరించాలి చాపాన్ని ఆర్తనాదం వినపడరాదని. అందుకు పోయినా నేనుగా తాపసులను రమ్మని ఆహ్వానించలేదు గదా వారంతట వారే వచ్చి నాతో మొఱపెట్టుకొన్నారు. రక్షణ ఇవ్వమని ప్రాధేయపడ్డారు. పైగా ఆ రాక్షసులను మేము శాపమిచ్చి భస్మం చేయడానికికూడా తపోవ్యయం చేయట మిష్టంలేక వారాఖరుకు మమ్ముల్ను చంపి తింటున్నా సహించి చూస్తున్నాము. ఎలాగైనా మా దీక్షారక్ష చేయమని కాళ్లవేళ్లా పడ్డారు. అందుకే నేను వారికి మాట ఇచ్చాను. అసలు

Page 161

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు