#


Index

ధర్మపాలనము

కాకపోతే వంశగౌరవం దెబ్బ తింటుంది. అది తమకు ప్రతిష్టాకరం కాదు. ఈ జరిగిన పూర్వ వృత్తాంతం టూకీగా భరతుడి చెవిలో వేసి అందుకే సుమా సోహం వనమిదం ప్రాప్తః సత్యవాదేస్థితః పితుః భవానపి తధేత్యేవ - పితరం సత్యవాదినమ్ కర్తుమర్హసి – నేనాయనను సత్యవాదిగా లోకానికి నిరూపించటానికే అరణ్యాలకు తరలివచ్చాను. నీవు అలాగే ఆయనను సత్యవాదిగా చాటాలి లోకానికని బోధిస్తాడు. చూడండి. అప్పటికి రాముడరణ్యానికి రావటం కేవలం పితృవాక్య పాలనమనే కాదు. పితృపాదుల కసత్యదోషం రాకుండా నివారించటానికి కూడా నన్నమాట.

  ఇంత ప్రగాఢమైనది రాముడి పితృభక్తి. పుత్ర అనే పేరు సార్ధకం చేసుకొన్న వ్యక్తి ఆయన. పున్నామనరకం నుంచి కాపాడేవాడనే గాక పూరణాత్పుత్రః తండ్రి చేయలేక వదలివేసిన కోరికలను సఫలం చేయటంవల్ల కూడా పుత్రుడు పుత్రుడవుతాడట. ప్రస్తుతం దశరథుడు చేయలేనిది తాను మామగారికిచ్చిన మాట నిలబెట్టుకోలేక పోవటం. అది నిలబెట్టగలిగాడు రాముడు. కనుకనే సుపుత్రుడాయన. పుత్రధర్మాన్ని ఎంతగానో అంతగా అనుష్ఠించాడు. తన తండ్రి విషయంలోనే గాదు. తండ్రి కత్యంత ప్రియమిత్రుడు తండ్రితో సమానుడైన జటాయు విషయంలో కూడా అలాంటి ధర్మాన్నే కనబరిచాడు. సీతను కాపాడటానికి రావణుడితో పోరి ప్రాణాలు కోలుపోయిన ఆ దిక్కులేని పక్షిని చూచి రాజా దశరథః శ్రీమాన్ యథామమ మహాయశాః పూజనీయశ్చ మాన్యశ్చ - తదాయం పతగేశ్వరః గృధ్రరాజమ్ దిధక్షామి – మత్కృతే నిధనంగతమ్ మన తండ్రి దశరథుడెలా మనకు పూజనీయుడో అలాగే ఈ గృధ్రరాజుకూడా, నా కోసంగా ప్రాణాలు వదలిన మహానుభావుడు. ఇతనికి దహన సంస్కారం చేయటం నా విధి అంటాడు లక్ష్మణుడితో తిర్యక్కులకు కూడా ప్రేతకార్యాలు నిర్వర్తిస్తానంటాడు చూడండి. అంతకంటే పుత్రధర్మాన్ని పాటించే దీక్షాపరుణ్ణి మరొకణ్ణి చూడగలమా మనం.

  పుత్రధర్మం తరువాత రాముడిలో చెప్పుకోవలసింది క్షత్ర ధర్మం. అది మన కరణ్యకాండలో కనిపిస్తుంది. క్షతాత్కిలత్రాయత ఇతిక్షత్రః క్షతము నుండి కాపాడేవాడెవడో వాడు క్షత్రియుడు. క్షతమంటే దెబ్బ. పరులవలన కలిగే ఉపద్రవం. ఎవరా పరులు. ఖరదూషణాది రాక్షసులు. అరణ్యంలో ఉండేదంతావారే. నిష్కారణ వైరులువారు. వారి వల్ల నిత్యమూ ఉపద్రవమే అక్కడ నివసించే తాపసులకు, వారినా

Page 160

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు