ఖండిస్తూ మాట్లాడినపుడు కూడా నచాపిజననీం జ్ఞాత్వా - త్వం విగర్హితు మర్హసి కామకారోమహాప్రజ్ఞ - గురూణాం సర్వదానఘ - ఉపపన్నేషు దారేషు - పుత్రేషుచ విధీయతే - తెలిసీ తెలియక మూర్ఖంగా నీవు నీ తల్లిని నిందించవద్దు. పెద్దలు తమ పిల్లలపట్ల ఎలా ప్రవర్తించినా చెల్లుతుంది. యావత్పితరి ధర్మజ్ఞే - గౌరవమ్ లోక సత్కృతే - తావద్ధర్మ భృతాం శ్రేష్ఠ - జనన్యామపి గౌరవమ్ - ధర్మజ్ఞుడైన తండ్రి యెడల నీకెంత గౌరవమున్నదో అంతే నీ తల్లి యెడల కూడా ఉండి తీరాలి. ధర్మవిధులలో శ్రేష్ఠుడనిపించుకొన్న నీకీ మాత్రం ధర్మం తెలియకపోతే ఎలాగ అని మందలిస్తాడు.
అప్పటికీ తెలుసుకోలేక ఆవేశంతో తల్లిదండ్రులు చేసిన దానికి వారిని నానా దుర్భాషలాడుతూ కోహిధర్మార్థయోర్హీనమ్ - ఈ దృశమ్ కర్మకిల్బిషమ్ – స్త్రీ యాః ప్రియంచికీర్షుస్సన్ - కుర్యాద్ధర్మజ్ఞ ధర్మవిత్ ముసలివాడయి మతిపోయి చేశాడేగాని లేకుంటే ధర్మం తెలిసిన ఏ రాజైనా ఆడదానికోస మిలాంటి అధర్మ మాచరిస్తాడా నీవే చెప్పమని నిలదీసి అడుగుతాడు రాముణ్ణి భరతుడు. దానితో ఇక బయటపడక తప్పదని చెప్పి రాముడతని కొక రహస్యం చెబుతాడు. కైకను పరిణయమాడే సమయంలో దశరథుడావిడ తండ్రికొక ప్రతిజ్ఞ చేస్తాడు. ఆవిడకు పుట్టిన కొడుకుకే రాజ్యమిస్తానంటాడు. జ్యేష్ఠుడికి తప్ప మరొకడికలా ఇవ్వటానికి లేదు. ఆ మాత్రం రాజధర్యం తెలియదా దశరథుడికి తెలుసు. తెలిసినా అంతవరకూ కౌసల్యా సుమిత్రలకు బిడ్డలు పుట్టలేదు. ఇక పుడతారనే ఆశలేదు. అందుచేత ఇక పుట్టినా చేసినా ఈ చిన్న భార్యకే గదా పుడితే వాడే జ్యేష్ఠుడవుతాడు గదా అని రాజనీతి ప్రకారం చూచినా వాడే రాజ్యార్హుడవుతాడు గదా అని అలా బరవసాపడి మాట జారాడు. కాని తరువాత పుత్రకామేష్టి చేయటం తత్ఫలితంగా రాముడే జ్యేష్ఠుడు కావటం దైవికంగా తటస్థించింది. దానితో ఖంగుతిన్నాడు దశరథుడు. భరతుడి కిప్పుడు రాజ్యమివ్వటానికి లేదు. మానటానికి లేదు. ఎలాగైనా వాణ్ణి తప్పించి రాముడికే కట్టబెట్టాలని చూచాడు. అది మరలా ఉల్టా సీదా అయింది. తాను చేసిన వాగ్దానం ప్రకారం భరతుడే రాజు కావలసి వచ్చింది. అలా కాకపోతే రాజనీతి గెలుస్తుంది గాని ఆయన మాట గెలవదు. మాట గెలవకపోతే సత్యసంధుడు కాలేడు తండ్రి. అందుచేత ఆయనను ఎలాగా సత్యసంధుడనిపించాలా అని రాముడి పట్టుదల
Page 159