#


Index

ధర్మపాలనము

నాతో చెప్పబనిలేదు. నీవు మాత్రం నాకు ఆరాధ్యవు కావా ? నీవు చెప్పినా నేను వెళ్లటానికి సిద్ధమే. అయితే ఆయన నోరు విప్పి మాట్లాడలేదే అని నా బాధ అంటాడు. తల్లిదండ్రుల మాట పాటించటంలో ఎంత సంసిద్ధతో చూడండి. అంతేకాదు. ననూనం మయికైకేయి - కంచిదాశంససే గుణమ్ - నీకు నా మీద హక్కుండి కూడా తండ్రి మీద నెపం పెడుతున్నావంటే నిజంగా నాలో పుత్రుడి కుండవలసిన గుణమే కొంచెము లేదని తోస్తుందంటాడు. తల్లిని తప్పు పట్టవలసిన చోట కూడా ఆ తప్పు తనదిగానే భావించాడంటే తల్లిదండ్రుల పట్ల ఎంత వినయమో, ఎంత గౌరవమో చూడండి. వందిత్వా చరణా రామో విసంజ్ఞస్య పితుస్తదా కైకేయ్యాశ్చాప్యనార్యాయా - నిశ్చక్రామ మహాద్యుతిః తరువాత తెలివి తప్పి పడి ఉన్న తండ్రికి దారుణంగా ప్రవర్తించిన తల్లికి ఇద్దరికి పాదాభివందనం చేసి మౌనంగా నిష్క్రమించాడట మందిరాన్ని, ఎంత గంభీరమైన మాటో ఇది. అన్నీ తెలిసి కూడా ఏమీ ఆక్షేపణ చేయకుండా పోవటమే ఉత్తమ కుమార లక్షణం.

  లక్ష్మణుడా తరువాత ఆగ్రహం పట్టలేక హనిష్యేపితరం వృద్ధమ్ కైకయ్యాసక్త మానసమని ఎగురుతుంటే కౌసల్య కూడా అది సమర్ధిస్తుంటే అంతా విని రాముడు ఇలా అంటాడు. నాస్తి శక్తిః పితుర్వాక్యం సమతిక్రమితుం మమ తండ్రి మాట కాదని పోయే ధైర్యం సాహసం నాకులేదు. ఇది మన పూర్వులంతా పాటించిన ధర్మం. నేను కాదనటంలో అర్ధం లేదని చెబుతూ లక్ష్మణుణ్ణి చూచి నీకు నా మీద అభిమానమున్నందుకు చాలా సంతోషం. కాని తండ్రి చెప్పిన మాట అధర్మం కాదు. ధర్మసంశ్రితమే నని తెలుసుకో. తదేనాం విసృజానార్యాం - క్షత్రధర్మాశ్రితాం మతిమ్ ధర్మమాశ్రిత్య మాతైక్ష్యం - మద్బుద్ధీరను గమ్యతామ్ చంపుతాను కొడతాననే బుద్ధి అనార్యుల నుసరించే బుద్ధి కేవల క్షాత్ర బుద్ధి పనికిరాదు. అలాంటి తీక్షణమైన బుద్ధి వదలిపెట్టి ఆర్యమైన నా బుద్ధి ననుసరించమని మెత్తగా చీవాట్లు పెడతాడు. అమ్మా ! నా కనుజ్ఞ ఇవ్వు. ప్రతిజ్ఞ నెరవేర్చి మరలా తప్పక వచ్చి నీ సేవ చేసుకొంటానని తల్లికి నచ్చచెబుతాడు. పితృ గౌరవానికిది పరాకాష్ఠ. తల్లిదండ్రుల దుఃఖాన్ని చూచి సహించలేడు రాముడు వారి నెవరైనా ఒక మాట అంటే భరించలేడు. వారు చేసిన పని ఎంత కాని పని అని నలుగురికీ అనిపించినా తానుగా ఆక్షేపించబోడు. భరతుడు వచ్చి తన తల్లి దుండగాన్ని నలుగుర ఎదుటా

Page 158

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు