#


Index

ధర్మపాలనము

బయట పెడతాడు. వారు ఆమోదిస్తారు. కుమారుడి గుణగణాలన్నీ కీర్తిస్తాడు. ఎంతగానో మురిసిపోయి ఆ తండ్రి కుమారుణ్ణి పిలుచుకొని రమ్మని సుమంత్రుణ్ణి పంపుతాడు. పంపితే ఆయన వెళ్లి ఏమి చెప్పాడో, రాముడేమి బదులిచ్చాడో అదేమీ తెలియదు మనకు. రామంతత్రా నయాం చక్రే - రథేన - రాముణ్ణి రథంలో తెచ్చాడు. అవతార్య సుమంత్రస్తం రాఘవం స్యందనోత్త మాత్ అక్కడ సభామందిరం ముందు ఆయనను రథంలో నుంచి క్రిందికి దించాడు. పితుస్సమీపంగచ్ఛంతమ్ పృష్ఠతో స్వాగాత్ ఆయనతండ్రి దగ్గరికి నడిచి వెళ్లుతుంటే వెంబడిస్తూ వెళ్లాడట. చూడండి. తండ్రి అంటే ఎంత గౌరవమో ఈ మూడు మాటల్లో తెలిసిపోయింది మనకు. తండ్రి రమ్మన్నాడని చెబితే చాలు. ఎందుకు ఏమిటనే ప్రశ్న లేదు. తీసుకెళ్లుతుంటే వెళ్లటమే ఎదురు నడవటమే మౌనంగా.

  అక్కడ కూడా ఆయన చెబితే వినవలసిందే. తానేమీ మాట్లాడేది లేదు. నామసంశ్రావయన్ రామో - వవందే చరణెపితుః తన పేరు ఫలానా అని చెప్పి తండ్రి పాదాలు పట్టుకొన్నాడట. సదాచారమెంత చక్కగా పాటిస్తున్నాడో చూడండి. దానికెంతగానో పరవశుడయిపోయి గాఢంగా కౌగిలించుకని తగిన ఆసనం చూపితే అప్పుడు వెళ్లి కూచుంటాడు రాముడు. ఏ పని చేసినా పెద్దల అనుమతితోనే చేయాలి. స్వతంత్రించగూడదే విషయంలోనూ తరువాత దశరథుడు తన అభిప్రాయము, దానికి ప్రజల ఆమోదము, అన్నీ ఏ కరువు పెట్టి యౌవ రాజ్యాభిషేకానికి తయారయి ఉండమని చెబితే అవునని గాని, కాదని గాని ఒక్కమాట అనడు రాముడు. కనీసం తన కింత వేడుక జరగబోతున్నదనే ఉత్సాహము కనబరచడు. ఆ ఉత్సాహం తన పరిజనులు పంచుకొని ముందుగానే వెళ్లి కౌసల్యకు చేరవేస్తారా శుభవార్త. పోతే రాముడు అథాభివాద్య రాజానమ్ - రథమారుహ్య రాఘవః యయౌస్వం ద్యుతిమద్వేశ్మ - జనౌఘైః పరిపూజితః జనమంతా చుట్టూ పొగడుతూ వస్తుంటే తండ్రి కభివాదం చేసి రథ మధిరోహించి మౌనంగా మరలా తన మందిరానికి వెళ్లతాడు.

  తండ్రి ఒకప్పుడు తనకిష్టంగాని మాట చెప్పినా అది అసంగత మనుచితమని తన కనిపించినా గుణవంతుడైన పుత్రుడు ప్రత్యక్షంగా ఎదిరించి మాట్లాడరాదు. ఇది కూడా రాముడి విషయంలో సాక్షాత్కరిస్తుంది మనకు. మరలా రెండవమారు పిలిపించి ఏకాంతంగా రాముడితో ప్రసంగిస్తాడు దశరథుడు. తాను ముసలి

Page 156

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు