ఏమి చేయమని మీ ఆజ్ఞ అని అడుగుతాడు. బాఢమిత్యేవతంరాజా, మునిశ్చ సమభాషత అలాగే చేయమని రాజు, మునీ ఒకేసారి అంటారు. కుతూహలం కొద్దీ జనకుడు, శిష్యుడందుకు సమర్థుడేనని విశ్వామిత్రుడు.
ఇలా చూస్తూ పోతే రాముడిలో సచ్చిష్యుడి కుండవలసిన లక్షణాలొకటిగావు. రెండు గావు. ఎన్ని ఉండాలో అన్నీ ఉన్నాయి. కనుకనే గుర్వనుగ్రహంవల్ల ఆయన సమస్తాస్త్ర శస్త్రకుశలుడూ, ప్రతీపశక్తి నిర్వాపణదక్షుడూ కావటమే గాక సాక్షాలక్ష్మీ స్వరూపిణి అయిన మైథిలిని కరగ్రహణం చేసి గురుకులం నుంచి సమావర్తనం కూడా చేసి ఉత్తమ గృహస్థ జీవితంలో ప్రవేశించినవాడూ అయ్యాడు. అంతేకాదు. తాను శిష్యధర్మమెలా పాటించాడో అలాగే గురువులు కూడా గురుధర్మాన్ని పాటించాలని ఆయన దృష్టి అలా పాటించిన ఆచార్యుణ్ణి ఎలా అనుసరిస్తాడో పరమాత్మ పాటించని వారినలా శిక్షిస్తాడు కూడా. సరిగా పరశురాముడి విషయంలో సాక్షాత్కరించింది. బ్రాహ్మవంశంలో పుట్టి క్షత్రియుడైన తనకు గౌరవపాత్రుడు కావలసిన అతడు నిష్కారణంగా సమస్త క్షత్రియవంశాన్ని నిర్మూలించటమే గాక క్రొత్తగా వివాహితుడయి వెళ్లుతున్న తనతోనే దారిలో జగడం పెట్టుకొన్నాడు. సగర్వంగా మాట్లాడాడు. అలాంటి ఔద్ధత్యమెవరిలో ఉన్నా సహించడు భగవానుడు. కనుకనే ఇది మీ బోటి పెద్దలకుండవలసిన లక్షణం కాదన్నట్టు సుకుమారమైన శిక్ష విధించాడాయనకు.
పోతే శిష్యధర్మమైన తరువాత రెండవది పుత్రధర్మం. అయోధ్యలో తార్కాణ మవుతుంది మనకు. మాతృదేవోభవ-పితృదేవోభవ అన్నారు. తనయుడికి తల్లిదండ్రులే మొదటి గురువులు. దేవతలలాగా ఆరాధనీయులు. రాముడు తన జననీ జనకుల విషయంలో అలాగే ప్రవర్తించాడు. తుదకు సీతను తాను పెండ్లి చేసుకొన్నది కూడా వీర్యశుల్క అని కాదట. దారాః పితృకృతా ఇతి తన తల్లిదండ్రులు చూచి చేశారని అంటాడు వాల్మీకి. అసలు దశరథుడు తన కుమారులు నలువురూ తన శరీరం నుంచి వెలువడిన నాలుగు చేతులని భావించేవాడట. వారిలో కూడా రామో రతికరః పితుః రాముడాయన కంటికి దీపం లాంటివాడు. అలాంటివాడు కనుకనే కదా నామసుతం ద్రక్ష్యా మ్యభిషిక్త మహం ప్రియమ్మని ఎంతో కాంక్షిస్తాడు. వెంటనే పౌరజానపదుల నందరినీ సమావేశం చేస్తాడు. తన మనసులో అభిలాష
Page 155