ఇలాంటి ఆర్యగుణ సంపత్తి అంతా అలవడి ఉండాలి. ఇవన్నీ పుడికి పుచ్చుకొన్న వాడొకడే ఉన్నాడు లోకంలో. వాడే రాముడంటాడు నారదుడు.
నారదుడీ లక్షణాలన్నీ ఏకరువు పెట్టాడంటే అసలా లక్షణాలను గూర్చి
ప్రశ్నించినవాడు వాల్మీకే. ఆయన ప్రశ్నిస్తేనే ఈయనగారీ వర్ణన చేసింది. వాల్మీకి
నారదుణ్ణి అడిగిన మహాపురుష లక్షణాలు పదహారు. కోన్వస్మిన్ సాంప్రతంలోకే,
గుణవాన్ కశ్చవీర్యవాన్ అని ఆరంభించి కస్యబిభ్యతిదేవాశ్చ, జాతరోషస్య సంయుగే
అనే వరకూ ఈ గుణాలుగల మహానుభావుడెవరో చెప్పమని కోరుతాడు. ముక్తసరిగా
పేర్కొన్న ఈ పదహారు గుణాలకూ వ్యాఖ్యానమే తరువాత నారదుడే కరువు పెట్టిన
గుణాలన్నీ. ఇవన్నీ ఏదో ప్రస్తావవశంగా చెప్పినవి కావు. అన్నీ రామాయణ కథా
భాగంలో అక్కడక్కడా మనకు దాఖలా అయ్యేవే. ధర్మజ్ఞత అనేది సరేసరి.
ఇతివృత్తమంతా పనగలిసి ఉందనుకోండి. కృతజ్ఞత అనేది జటాయువు
కంత్యసంస్కారాదులు చేయటంలో హనుమదాది వానరులను సవిశేషంగా
సత్కరించటంలో కనిపిస్తుంది మనకు. మరి సత్యవాక్యమనేది సుగ్రీవాదులకు మాట
ఇచ్చి నెరవేర్చటంలో, దృఢవ్రతం భరతుడు వచ్చి ఎంత వేడినా పట్టణానికి తిరిగి
రాకపోవటంలో సాక్షాత్కరిస్తుంది. చారిత్రమంటే సత్ప్రవర్తన. ఆయన ఏకపత్నీవ్రతంలో
కనబడుతుందది. శూర్పణఖ అందమైన రూపం కూడా భ్రమపెట్టలేదాయన
అంతరంగాన్ని. పోతే సర్వభూతాలనూ దయగా చూడటమనేది కాకాసురాదులనూ
మారీచాదులనూ మన్నించటంలో తార్కాణమవుతుంది. విద్వాన్ అనే మాట
హనుమంతుడి పాండిత్య ప్రకర్షను మెచ్చుకోటంలో విదితమవుతుంది. సమర్ధత
సముద్ర తరణాదులలో తెలుస్తుంది. ఏకప్రియ దర్శనత్వం మానవ దానవ వానర
మహర్షి దేవతాది జాతులన్నీ ఆయన దర్శన స్పర్శన సాన్నిధ్యాదులభిషించటంలోనే
వ్యక్తమవుతుంది. ఆత్మవాన్ అంటే ఆత్మతత్త్వజ్ఞత. అది భరతాదులకు అక్కడక్కడా
చేసిన ఆధ్యాత్మిక ప్రబోధంలో తేట పడుతుంది. ద్యుతిమాన్ అంటే తేజస్విత. అది
రాముడు విషయంలో చెప్పనే అక్కరలేదు. అలవోకగా దగ్గరికి వచ్చినా
దశరథుడాయనను చూచేసరి "కలంకృతమి వాత్మాన మాదర్శతలసంస్థితమ్” బాగా
ముస్తాబు చేసుకొని తన రూపాన్ని తానే అద్దంలో చూచుకొన్నట్టున్నాడట రామచంద్రు
డాయన కండ్లకు. ఆఖరు కభిషేక భంగమై అరణ్యానికి బయలుదేరే సమయంలో
Page 149