కడచిన ప్రకరణంలో మనం కృష్ణుడు మోక్షపురుషార్థాన్నైతే రాముడు ధర్మపురుషార్థాన్ని ప్రబోధించటాని కవతరించాడని వర్ణించాము. కనుకనే భాగవతాదులు పురాణాలైతే రామాయణ మితిహాసమయిందని కూడా పేర్కొన్నాము. ఇతాహాసమెప్పుడూ ధర్మప్రధానం. ధర్మమనేది మానవులందరికీ ఆవశ్యకం గనుక తత్కథానాయకుడు కూడా ఒక మానవోత్తముడే కావలసి ఉంది. సాక్షాత్తూ భగవానుడే అవతరించాడని చెప్పినా ఆయన కూడా తదనురూపంగా వ్యవహరించవలసిందే. అది తన దృష్టిలో ఒక అభినయమే కావచ్చు. అయినా మానవ స్వభావానుసారియే అది. అలాగే ప్రదర్శిస్తూ వచ్చిన జీవితం రామజీవితం. అది మొదటినుంచి చివరిదాకా ధర్మబద్దమయి ధర్మోపదేశకంగానే సాగింది. ధర్మ సంస్థాపనార్థమే గదా అవతరించింది తాను. అది కృష్ణావతారంలో అయితే నివృత్తి ధర్మప్రతిపాదకం. మరి ఇది రామావతారం. ఇందులో తాను చేయవలసింది ప్రవృత్తి ధర్మప్రతిపాదన. అది ఎంతగా చేయాలో అంతగా చేశాడు. తాను చేశాడు లోకం చేత చేయించాడు. సయత్ప్రమాణమ్ కురుతే - లోకస్త దనువర్తతే - తానేది ప్రమాణమని స్థాపిస్తే అదే లోకులనుసరిస్తారు. తాను బద్ధకిస్తే లోకులంతకన్నా బద్ధకిస్తారు. పైగా ధర్మమనేది చాలా కర్కశమైనది. నిర్దాక్షిణ్యమైనది. దానికి తన పర అనే అనుబంధాలు లేవు. ధర్మంచర అన్నారు. చెప్పేది కాదది. చేసేది. చేయటంలో ఎలాంటి పొరపొచ్చెమూ ఉండరాదు. ఉంటే అది ఛలం క్రిందికి వస్తుంది. అది ఎవరి విషయంలో కనిపించినా క్షంతవ్యంకాదు. అసిధారా వ్రతంలాంటిది ధర్మపాలన మనేది.
రాముడి జీవితమంతా ఇలాంటి వ్రతానుష్ఠానమే. దృఢవ్రతః అని అనేక పర్యాయాలు రాముణ్ణి వర్ణిస్తాడు వాల్మీకి. అంతేకాదు 'రామోవిగ్రహవాన్ ధర్మః' మూర్తీభవించిన ధర్మమే నంటాడు రాముణ్ణి. ధర్మభృతామ్ వరః అని వాల్మీకి మాట. ధర్మమంటే ధనుస్సని కూడా అర్థమే. ధనుస్సు నెలా ధరించాడో రాముడు ధర్మాన్ని కూడా అలాగే ధరించాడు. తన ధనుస్సులాగే తన ధర్మంకూడా గురితప్పదు. నిర్లక్ష్యంగా వర్తించదు. లక్ష్యంమీదనే దృష్టి తండ్రి దశరథుడు విడిచిన బాణమైనా
Page 147