ఏముంది. అయినా వ్యవహరించాడంటే అది మనబోటి జీవకోటి కోసమే. ఒకచోట బయటపడి, మరొకచోట పడక ఇంతే తేడా. పడనిచోట కూడా అంతరాంతరాల్లో దాగి ఉన్నదదే. ఆంతర్యాన్ని భేదిస్తే ఇదికూడా అదే. కృష్ణుడికి చతుర్భుజాలుంటే రాముడికీ ఉన్నాయి నాలుగు భుజాలూ సుగ్రీవ విభీషణులే మిగతా రెండు భుజాలు. ఆయనకు శంఖ చక్రాలుంటే ఈయనకూ ఉన్నాయవి భరత శత్రఘ్నరూపాలలో మరి అక్కడ రుక్మిణి అయితే ఇక్కడ సీత. అక్కడ శేషావతారుడు బలరాముడిక్కడ లక్ష్మణుడే. శార్హమిక్కడ కోదండమైతే నందక మగస్త్యుడిచ్చిన ఖడ్గమైతే కౌమోదకి ఆయన ఇచ్చిన మోదకి అనే గద అయితే ఇక తక్కువేముంది రాముడికి మందహాస సుందరవదనారవిందాని కేలాంటి కొదవాలేదు. ఇద్దరికీ కావలసినంత ఉందది. పోతే గరుత్మంతుడొక్కడు లేడే అనే కొఱత ఎవరికైనా ఉంటే అది తీర్చటానికి తయారుగా ఉన్నాడు హనుమంతుడు. హనుమంతుడు గరుత్మంతుడే. ఆకాశ గమనం చేశాడు. ఎక్కడికంటే అక్కడికి ఆయనను మోసుకెళ్లాడు. సీతను కూడా మోసుకెళుతానన్నాడు, అయితే ఆవిడ ఒప్పుకోలేదుగాని. ఇలా దర్శిస్తూ పోతే అంతా రామలీలే. అంతా కృష్ణలీలే తుదకంతా భగవల్లీలే భావుకుడి దృష్టికి.
Page 146