#


Index

రామ యాథాత్మ్యము

ఋణవిముక్తుణ్ణి చేయాలంటాడు. ఋణమేమిటి - విమోచనమేమిటని ఆశ్చర్యం వేస్తుంది మనకు. అది ఒక రహస్యం. రాజరహస్యం. తప్పనిసరి అయి బయట పెడతాడు రాముడు. పురాభ్రాతః పితానస్స మాతరంతే సముద్వహన్ మాతామహేసమాశ్రాషీ - ద్రాజ్యశుల్కమనుత్తమమ్ - దైవాసురేచ సంగ్రామే దదౌరాజావరమ్ - ఇంతకు ముందు నీ తల్లి కైకను పరిణయమాడే సమయంలో మీ మాతామహుడితో ఒక సమయం చేసుకుని ఉన్నాడు మన తండ్రి. ఆవిడకు పుట్టిన కుమారుడికే రాజ్యమప్పగిస్తానని ఆ తరువాత తల్లికి రెండు వరాలు కూడా ఇస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అదే ఆయనకున్న ఋణం. దాన్ని తీర్చి ఆయనను ధర్మాత్ముడు సత్యవచనుడని లోకానికి నిరూపించవలసిన బాధ్యత నీమీదా నామీదా ఉంది. చూడండి. ఈ రహస్య వృత్తాంతం బహుశా కైకకు మంథరకూ తప్ప మరెవరికీ తెలిసి ఉండదు గదా. రాముడికెలా తెలిసింది. అంతకుముందు గడిచిన కథలో ఈ ప్రస్తావనే రాదెక్కడా. ఉన్నట్టుండి బయట పెట్టాడంటే రాముడు పరావరజ్ఞుడైన అవతార పురుషుడు గనుకనే గ్రహించగలిగాడు. బయట పెట్టగలిగాడు.

  సరే భరతుడు పాదుకలు తీసుకొని వెళ్లిపోతాడు. ఆ తరువాత అక్కడి మహర్షులు కొందరు తమ్ముచూచి గుసగుసలాడటం చూస్తాడురాముడు. వారిలో ఒక వృద్ధును కలుసుకొని దేనికీ మీరంతా ఇలా ఆందోళన చెందుతున్నారు. మావల్ల అపచారమేమీ జరగలేదుగదా అని అడుగుతాడు. దానికాయన ఇలా సమాధానమిస్తాడు. అయ్యా! రావణుడి తమ్ముడు ఖరుడని ఒకడున్నాడు. వాడికి నీవిక్కడికి రావటమిష్టంలేదు. నీవు వచ్చినప్పటి నుంచీ మమ్ములనందరినీ పట్టి బాధిస్తున్నాడు. అందుచేత మేమీ అరణ్యాన్ని విడిచి మరొకచోటికి వెళ్ళుదామని చూస్తున్నాము. నీకుకూడా వాడు త్వరలోనే కీడు చేయవచ్చు. నీవూ ఇక్కడి నుంచి వెళ్లిపోవటం మంచిదంటాడు. ఇది చూచారా ఈ ప్రసంగం. రాముడు తమకు శత్రువు, రాక్షస సంహారం కోసమే వచ్చాడని రాక్షసులకందరికీ తెలుసు. అంటే ఆయన విష్ణువని వారికి గుర్తేనన్నమాట. అందులోనూ రావణుడి తమ్ముడు ఖరుడు. రావణుడు చెబితేనే వాడికి కూడా తెలిసి ఉంటుంది.

  అప్పటినుంచీ రాముడిక సీతా లక్ష్మణులతోపాటు ఆ మహర్షి ఆశ్రమం ఈ మహర్షి ఆ! మం తిరుగుతూనే ఉంటాడు. మొదట అత్రిమహర్షిని దర్శిస్తారు వారు.

Page 136

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు