#


Index

రామ యాథాత్మ్యము

యత్సృష్టాసి మయాసార్థం - వనవాసాయ మైథిలి - అనుగచ్ఛ స్వమాంభీరు సహధర్మచరీభవ - నీవు నాతో వనవాసం చేయటానికే సృష్టింపబడ్డావు. నిన్ను ఎడబాసి పోవటమంటూ ఉండబోదు. నాతో వచ్చి సహధర్మచారిణి వనే పేరు సార్ధకం చేసుకో ఏమిటీ మాటలు మొదట రావద్దనటమేమిటో ఇప్పుడు వచ్చి తీరాలనట మేమిటి. తవసర్వమభిప్రాయ మవిజ్ఞాయ అనేమాటలో ఉంది దీనికి జవాబు. నాకు తెలిసినా నీ అభిప్రాయమేమిటీ నేను తెలుసుకోవాలి గదా అంటాడు. ఎంత లోతైన స్వభావమో చూడండి రాముడిది. మరి లక్ష్మణుడు కోపావేశం పట్టజాలక కైకను కొడతాను, చంపుతానంటుంటే అనునయిస్తూ రాముడన్న మాటలు చూస్తే, ఆయన పరావర జ్ఞానమెలాంటిదో మనకు పట్టి ఇస్తాయి. కృతాంతస్త్వేవ సౌమిత్రే - ద్రష్టవ్యో మత్ప్రవాసనే - రాజ్యస్యచ వితీర్ణస్య - పునరేవనివర్తనే కైకేయ్యాః ప్రతిపత్తిర్హి - కథంస్యాన్మమపీడనే యది భావోన దేవైయమ్ కృతాంతవిహితో భవేత్ - కథమ్ - ప్రకృతి సంపన్నా - రాజపుత్రీ హ్యనిందితా ఉన్నత వంశంలో పుట్టి నన్నింత వాత్సల్యంతో చూచే మా అపరాధం కాదు. మరొక కారణంకాదు అంటాడు. ఈ దైవమెవరో గాదు. తానే తన్నుగూర్చి తానే వ్యంగ్యంగా సూచిస్తున్నాడు. అంతేకాదు. తరువాత వల్కల ధారణ మొదలుకొని వన ప్రస్థానం వరకూ ఎన్ని విషయాలు జరుగుతున్నా ఎవరెన్ని దీనా లాపలు చేస్తున్నా అందరూ కలిసి కైక నెంతగా ఆడి పోసుకొంటున్నా, ఒక్క మాట అయినా మాట్లాడక మౌనంగా పట్టణాన్ని దాటి వెళ్లిపోవటమింకా గంభీరమైన విషయం.

  తరువాత భాగీరథీ తీరంలో గుహుణ్ణి కలుసుకొన్నాడు రాముడు. భరద్వాజుడ్జీ కలుసుకొన్నాడు. ఇద్దరూ తనకు పూర్వపరిచితులే. ఇద్దరికీ తెలుసు ఆయన పట్ట భంగమై అక్కడికి వచ్చాడని. అయ్యో ఇలా జరిగిందని మాకు తెలుసునంటారేగాని అంతకుమించి దాన్ని వ్యాఖ్యానించరు వారు. రాముడూ దాన్ని గూర్చి ప్రస్తావించడు. ఒక్క భరతుడు వచ్చి తన్ను తిరిగి రమ్మని బలవంతం చేసినప్పుడే కొంత దీర్ఘంగా చర్చ జరిగింది. అక్కడ ఒక విశేషమేమంటే భరతుడెంత బ్రతిమాలుతున్నా వాటి కొక్కటే జవాబిస్తాడు రాముడు. సమయా శాసనం తస్యత్యక్తుమ్ న్యాయ్యమరిందమ . తత్త్వయాపిసదా మాన్యమ్ - ఋణాన్మోచయ రాజానమ్ మత్కృతే- నాకు గాని నీకు గాని తండ్రిగారి శాసన ముల్లంఘించటం ధర్మంకాదు. ఆయనను నీవు

Page 135

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు