అవన్నీ తనకు తెలీదనా. తనకు ప్రమేయమున్నవే చాలావరకవి. అయినా గురుముఖంగా వినాలని కుతూహలం. అంతలో గౌతమాశ్రమ ప్రవేశం, అహల్యా శాపవిమోచనం కూడా జరుగుతుంది. ఇది చాలు రాముడవతార పురుషుడని చెప్పటానికి అహల్యను శపించినప్పుడే గౌతముడామెకు శాపమోక్షం సూచించాడు రామదర్శనం కలిగినప్పుడు గాని శాపం నివృత్తి కాదని. రాముడి రాకకోసం కనిపెట్టుకొని ఉన్నదావిడ. మరి విశ్వామిత్రుడి వెంట ఆయన గారలా రాకపోతే ఎలాగ.
పిమ్మట మిథిలలో జనక సమాగమం కలుగుతుంది. జనకుడు వారిని చూచి ఆశ్చర్యపడుతూ అడిగితే వారు చేసిన ఘనకార్యాలన్నీ వివరించి ధనుస్సు మీద వారికి మక్కువ ఉండి వచ్చారంటాడు. నిజానికి మక్కువ ఉన్నది తనకు. రాముడికి కాదు. అయినా ఈ మాట అన్నాడంటే పైకి లేనట్టు నటించినా లోపల రాముడికీ ఉందన్నమాట. అది విశ్వామిత్రుడికి తెలిసే అని ఉంటాడు. జనకుడు దాని పూర్వ చరిత్ర అంతా ఏకరువుపెట్టి అలాంటి ఈ విల్లు రాముడెక్కు పెట్టగలిగితే సీతనిచ్చి పెండ్లి చేస్తానంటాడు. అంతా విని విశ్వామిత్రుడు ధనుర్దర్శయ రామాయ - మా రాముడికి ధనుస్సు చూపించవయ్యా చాలునంటాడు. వెంటనే అయిదువేల కింకరులు దాన్ని అష్టచక్రమంజూషలో కొని రాగానే వత్సరామధనుః పశ్య వెళ్లి చూడు రామా ఆ ధనువునంటాడు మళ్లీ గురువు గారు. గురు హృదయం తెలిసిన శిష్యుడు మంజూషాం తామ-వృత్య దృష్ట్వాధనురభాషత చూచాను. గురుదేవా ! ఏమి చేయమంటారీ ధనువును, తోలనమా పూరణమా ఏమి చేయమంటారని అడుగుతాడు. అలాగే నన్నాడోలేదో ఎక్కుపెట్టి లాగగానే దానిపాటికదే విరిగిపోయిందా విల్లు. చూడండి. తనకు తెలుసు దాన్ని ఆరోపించే శక్తి ఉందని. దానివల్ల సీత పాణిగ్రహణం కూడా కలుగుతుందని, అయినా ఆ గురువు మాట జవదాటనట్టు ఆయన మాటమీదనే నడుచుకొన్నట్టు నటన.
తరువాత దశరథాదులు రావటమూ, వివాహ మహోత్సవం జరగటమూ, అయోధ్యకు తరలి రావటమూ ఎంతో జరిగింది. ఏ ఒక్క ఘట్టంలోనూ వారు వారు మాటాడుకోవలసిందే గాని రాముడు ఒక్క మాట మాటాడడు. అసలు మొదటినుంచీ అంతే. అతి మితభాషి. భాషించక భాషించక ఎప్పుడో ఒక్కసారి
Page 131