భాషిస్తాడు. అది అన్నీ తెలిసిన భగవానుడు భాషించినట్టే ఉంటుంది. అక్కడక్కడ ఇదేమిటదేమిటని మాత్రమే అడిగింది రాముడు. ఇక ఎక్కడ ఎప్పుడేది ఏ కరువు పెట్టినా విశ్వామిత్రుడే. కేవలం తానొక సాక్షిమాత్రుడుగానే ఆలకిస్తూ ఆయన చెప్పింది ఆచరిస్తూ ఉండిపోతాడు. చూడబోతే ఆయన ప్రణాళికంతా తన ప్రణాళికే గనుక అలా మౌనం వహించాడని తోస్తుంది. మౌనమర్ధాంగీకారమనే మాట ఉండనే ఉందిగదా. పోతే అంతవరకూ తొణకని రాముడాఖరున పెండ్లివారితో పాటు అయోధ్యకు తరలిపోయే సమయంలో విజృంభిస్తాడు. పరశురాముడెదిరించి నిలిచినప్పుడే ఆయన ఘాటుగా మాట్లాడింది. పరుశరాముడూరక ప్రగల్భాలు నరుకుతుంటే అంతా విని రాముడు శ్రుతవానస్మి యత్కర్మ కృతవానసి భార్గవ నీవు చేసిన ఘనకార్యాలన్నీ ఎరుగుదును లేవోయి మహాత్మా పశ్యమే ద్యపరాక్రమమ్ ఇక నా పరాక్రమం చూడు అని ధనుస్సు ఆరోపించటంతో పాటు అతని తేజస్సు లాగి వైచి బాణం విడవబోయే సరికా మహాత్ముడు ఆదినారాయణుడని అర్ధమై పోతుందా బాపడికి. వెంటనే అక్షయం మధుహంతారం జానామిత్వామ్ సురోత్తమమ్ - ధనుషో స్యపరామర్శాత్ - స్వస్తి తేస్తు వరంతప - స్వామీ నీవు ఈ ధనుస్సును పట్టుకోటం ఎక్కు పెట్టుటంలోనే అర్ధమయింది నీవు సాక్షాత్తు ఆ మధుసూదనుడవే నని నమస్కరించి వెళ్లిపోతాడు. చూడండి. రాముడికి తెలుసు పరశురాముడికీ తెలుసు ఒకరి సంగతి ఒకరికి. శివధనువు విరిచాడంటే తప్పక అతడు విష్ణువేనని తెలుసు పరశురాముడికి. అందుకే వైష్ణవ ధనుస్సు తీసుకొని వచ్చాడాయన ధనుస్సు నాయనకే ఇచ్చిపోదామని. అలాగే ఆ ధనుస్సుతో ఇకమీదట తనకు చాలా అవసరముందని రాముడికి తెలుసు. అందుకే ఇవ్వగానే చేతికి తీసుకొన్నాడు. ఇక నీ అవతార ప్రయోజనమయిపోయింది. ఇక నాకే ఉంది రాక్షస సంహారభారమన్నట్టు. తీసుకోగానే కోపవ్యాజంతో ఆయనగారిని వెనక్కు పంపివేశాడు. మరి ఇరువురూ భగవత్స్వరూపులు కాకుంటే ఒకరి మర్మమొక రెలా గ్రహించగలరు.
ఇక అయోధ్యలో అడుగిడినప్పటి నుంచీ అభిషేక భంగమయ్యేదాకా నోరు మెదపలేదు రాముడు. అభిషేకం చేయాలన్నా, మానాలన్నా, ఏమల్లగుల్లాలుపడ్డా, అదంతా దశరథుడే. తన్మూలంగా ఏ హర్ష విషాదాల ననుభవించినా కైకేయీ మంథరలే. కౌసల్యా వసిష్ఠాదులే. అభిషేకం చేస్తానన్నా జవాబివ్వలేదు. చేయను
Page 132