#


Index

ఆలోకనము

నియామకంగా నానావిధాలైన ధర్మాలు భాసిస్తే వాటికి కూడా అతీతమై వాటి వెనకాలనే చోటు చేసుకొని భావుకుని ప్రత్యగృష్టికి కావ్య తాత్పర్యానికి పర్యవసానంగా స్ఫురిస్తుంది మోక్ష పురుషార్థం. ఇలా ధర్మార్ధకామ మోక్షాలనే చతుర్విధ పురుషార్ధాల పరస్పర సామరస్యాన్ని కూడా బయటపెట్టే మహానిర్మాణమిది.

  అలాంటప్పుడిలాంటి రచనను గూర్చి అపోహ లేర్పడటంలో ఆశ్చర్య మేముంది. రచన సూక్ష్మమయ్యే కొద్దీ మార్మికత ఎక్కువయ్యే కొద్ది దాని నపార్ధం చేసుకోవటం కూడా ఎక్కువే. ఇలాగే చేసుకొంటారు లోకులని వాల్మీకికి కూడా తెలుసు. తెలుసు గనుకనే తన కావ్యారంభంలోనే బాణం లాంటి మాట ఒకటి మనమీద పారవేశాడు. శ్రోతవ్యమనసూ యయా అసూయ లేకుండా వినమని హెచ్చరించాడు మనల నాయన. అసూయ అంటే ఈర్ష్యకాదు. ఈర్ష్య వేరు. అసూయ వేరు. ఒకటి సహించలేకపోతే ఈర్ష్య, ఒకదానిలో నిజంగా గుణమున్నా దోషమని చాటితే అది అసూయ. నేను రచించిన ఈ కావ్యం వాస్తవానికి సకలగుణ సంపన్న మయినది. ఎందుకంటే ధర్మ కామార్థ సహితమ్. ధర్మార్థ కామాలనే త్రివర్గాన్నీ చక్కగా బోధిస్తున్నది లోకానికి. అందుకే తదిదమ్ వర్తయిష్యామి సర్వమ్ నిఖిల మాదిత: దీని నామూలాగ్రము వీసమైన బీరువోకుండా నేను తీర్చిదిద్దుతున్నాను. అని కవి స్వయంగానే మనకు చాటి చెబుతున్నారు. అయితే తీరుస్తున్నాడంటే ఈ కథ స్వకపోల కల్పితమా లేక అంతకు పూర్వమే లోకంలో ప్రసిద్ధమా అని ప్రశ్న వస్తుంది. దీనికి కూడా ఆయనే సమాధానమిస్తున్నాడు. ఇక్ష్వాకూణా మిదం తేషా మాసీద్రాజ్ఞామ్ మహాత్మనామ్ మహదుత్పన్న మాఖ్యానం రామాయణమితి శ్రుతమ్. మహాత్ములైన ఇక్ష్వాకువుల వంశంలో జరిగిన ఒక మహాఖ్యానమట ఇది. రామాయణమనే పేర బహుళ ప్రచారంలో ఉన్న కధ అట. మహాత్ముల వంశంలో జన్మించిన మహాఖ్యాన మనటంలో దాని మహత్త్వాన్ని సూచిస్తున్నాడు కవి. వ్యక్తులను బట్టే వారి జీవితం. ఇక్ష్వాకు రాజులంతటి మహనీయులు కారణం. ప్రజాపతి ముపాదాయ

Page 13

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు