#


Index

ఆలోకనము

లేదు. ముందు చెప్పినట్టు క్రాంతదర్శి అయినమహర్షి ఎప్పుడూ లోకహిత కామనతోనే ఒక రచన కావిస్తాడు. లోక వ్రతారణం కోసమో ఆత్మవినోదం కోసమో, అయితేఅతడొక మహర్షి కాడు. మహాకవి కాడు. మరి ఆదికవి అని, మునిపుంగవుడని అందరిచేత మన్ననలందుకొన్న మహనీయుడాయన. అలాంటివాడి పవిత్రమైన లేఖిని ఇలాంటి లేకి రచన చేసిందని చెప్పటంగాని, అలా భావించటంగాని ఎంత అపచారం. మన దృష్టితో మనం చూస్తున్నాము మహాకవి కావ్యసృష్టిని, మన దృష్టిని బట్టి సృష్టించలేదాయన. తన దృష్టిని బట్టి సృష్టించాడు. అది సమస్త దేశకాల వస్తు దశా విశేషాలనన్నింటినీ చక్కగా ఆకళించుకొన్న క్రాంత దృష్టి దానికి రాగద్వేషాలుగాని, భ్రమ ప్రమాదాలుగాని, స్వార్ధసంకుచితాలు గాని లవలేశం కూడా సమీపానికి రానేరవు.

  అయినా ప్రజ్ఞావంతులైన వ్యక్తులు కూడా కొంతమంది దాని నపార్ధం చేసుకొంటున్నారంటే అది మహర్షి రచనలో ఉన్న మార్మికత. ఇతిహాసమే గాక ఒక రమణీయమైన కావ్యం కూడా రామాయణం. కావ్యమనేసరికి ప్రతీయమానమైన భావ సంపద ఎంతైనా ఉంటుంది రచనలో. అదే ఇంతకుముందు నుంచీ మేము ఏ కరువు పెడుతూ వచ్చింది. పైకి లౌకికంగా నడుస్తున్నా లోలోపల ఒక అలౌకికమైన తత్త్వ మంతర్వాహినిగా ప్రసరిస్తూ ఉన్నది. పైకి కనిపించే కధలో కూడా ఎన్నో ధర్మసూక్ష్మాలు దాగి మనతో దోబుచులాడుతుంటాయి. వీటన్నిటినీ కబళించేటంత కావ్యసౌందర్యముంది అడుగడుగునా. ఎంత సౌందర్యమంటే అది అసలొక కాండకు పెట్టిన అసలు పేరే పోయి సుందరకాండ అనే ఒక క్రొత్త పేరు లోకంలో వచ్చిపడింది. ఇందులో కాంతా సమ్మితమైన కావ్యవ్యంజనను భేదిస్తేగాని అందులో దాగి ఉన్న ధర్మసూక్ష్మమంతు పట్టదు. అదికూడా గ్రహిస్తే గాని అన్నిటినీ కలుపుకొని ఆమూలచూడంగా వ్యాపించి ఉన్న ఆధ్యాత్మిక రహస్యం మనసుకు రాదు. శబ్దార్థ గతమైన సౌందర్యమర్థకామాల అనుభూతినందిస్తే వాటికి

Page 12

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు