#


Index

ఆలోకనము

కనిపిస్తున్నది. ఎటువచ్చీ ఆ ధర్మబోధలో కూడా కొన్ని అవకతవకలు గోచరిస్తున్నాయి. అభిషేక భంగం, వాలి వధ, సీతాపరిత్యాగం, శంబూక వధ ఇలాంటి అసందర్భాలెన్నో కొన్ని దొర్లాయి గ్రంథంలో, సీతారాముల కోసం ఊర్మిళను లక్ష్మణుడు పరిత్యజించి వెళ్లటమసలేమి ధర్మం. ఒక భార్యను తృప్తిపరచటం కోసం జ్యేష్ఠుడికి న్యాయంగా చెందవలసిన రాజ్యం కనిష్ఠుడి కొప్పజెప్పటమేమి ధర్మం. ఇలా ధర్మ ప్రతిపాదన విషయంలో కూడా అన్ని విడ్డూరాలు కనిపిస్తున్నాయి గదా. వీటికేమిటి సమాధానమని వీరి ఆక్షేపణ.

  ఇది కూడా అవిచార మూలకమైన ఆక్షేపణ. కథలో గర్భితమైన అధ్యాత్మ రహస్యమెలా గోచరం కాలేదో అలాగే పైకి కనిపించే ధర్మ ప్రతిపాదనలో కూడా గుప్తమయి ఉన్న కొన్ని ధర్మ సూక్ష్మాలంతు పట్టటం లేదు చాలామంది విమర్శకులకు. రామాయణంలో మహర్షి ఎన్ని ధర్మాలు చెప్పాడో అన్ని ధర్మ సూక్ష్మాలు వర్ణించాడు. అయితే అవన్నీ కంఠోక్తిగా గాక ప్రేక్షావంతుల ఊహకే వదలిపెట్టాడు. లోకశాస్త్రాద్యవేక్షా జన్యమైన సంస్కార బలంతో పౌర్వాపర్యం కలియ బోసికొని చూచే ఏ ఒక్కడికో గాని అది అంతుచిక్కదు. మిగతా తొంబది తొమ్మిది మందికి అంత సూక్ష్మేక్షికతో చూచే నేర్పుగాని, ఓర్పుగాని ఉండబోదు. అలా లేకనే ఎంతో మంది రామాయణ కధా సన్నివేశాల మీద, పాత్రల చిత్రణం మీద అసంతృప్తి చెంది తమ భావాల కనుగుణంగా ఎన్నో మార్పులు చేర్పులు చేసి రచనలు సాగించారు. కొందరైతే రచనలంటూ చేయలేదు గాని తమ దృష్టికోణంతో తమ దేశకాలాదుల ప్రమాణంతో చూచి బుద్ధులకు తోచినట్టు విమర్శిస్తూ ఒకప్పడతి నీచంగా కూడా దుమ్మెత్తి పోస్తున్నారు. మహర్షి ఒక ముద్దాయి అయినట్టు భావించి న్యాయస్థానంలో నిలబెట్టి జాడించినట్టు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారాయన మీద.

  ఇంతకూ వాల్మీకి హృదయమెవరికీ బోధపడలేదు. అది చక్కగా గ్రహిస్తే ఇలాంటి గాలి దుమారమేదిగాని చెలరేగేది గాదు. అవసరము

Page 11

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు