తిట్టిపోసేవారు కూడ భంగ్యంతరంగా దాని విశ్వజనీ నతను బయటపెడుతూనే ఉన్నారు.
అలాంటప్పుడీ విమర్శలన్నీ ఎందుకిలా బయలుదేరాయని అడగవచ్చు. కవి హృదయ మవగాహన చేసుకోలేక అని ఇంతకు ముందే చెప్పి ఉన్నాను. వాల్మీకి హృదయం చాలా లోతైనది. అది మానవుడికి ధర్మాన్ని, మోక్షాన్ని రెండు పురుషార్ధాలనూ సమానంగా పంచిపెడుతున్న రచన. అందులో ధర్మబోధ సూటిగా సాగితే తత్త్వబోధ చాటుగా సాగుతూ పోతుంది. ఇలా రెండూ ఓతప్రోతంగా అల్లుకొని అవినాభూతంగా సాగటం మూలాన ఎంతో జాగ్రత్తగా చూస్తే గాని దానిలోతు మనకంతు పట్టదు. కొందరు బాహ్యమైన ధర్మబోధ మాత్రమే చూచి దానిమేరకే విమర్శ చేస్తారు. వారికందులో దాగి ఉన్న అధ్యాత్మ రహస్యాలు మనసుకు రావు. దానిని బయటపెట్టటానికే అధ్యాత్మ భావార్థ రామయణాదు అవతరించాయి. అవి రామాయణ కధా రహస్యాలు కొంతవరకూ వివరిస్తు వచ్చాయి. కాని ఆధ్యాత్మికమైన అన్ని భావాలను సమగ్రంగా వివరించినవి కావు. ఇంకా ఎన్నో విశేషాలు మిగిలిపోయి ఉన్నాయి చెప్పవలసినవి. అసలు నన్నడిగితే మనమెవరము వివరించనక్కరలేదు. వాల్మీకి సకల విషయాలు వర్ణించి చెప్పాడు. అయితే వాచ్యంగా కాదు. వ్యంగ్యంగా అందుకే ఆయన ఏదీ చెప్పలేదు. మేమే క్రొత్తగా ఆవిష్కరిస్తున్నామని అధ్యాత్మరామాయణాది కర్తలు లేని పెత్తనమొకటి నెత్తిన వేసుకొని వ్రాశారా గ్రంథాలను.
పోతే ఈ ఆధ్యాత్మికమైన అంతరార్థాలు మాకు దేనికి. అసలవి కవి ఉద్దేశించాడో లేదోగాని మీరనవసరంగా కాకదంత పరీక్ష చేస్తున్నారని కొందరాక్షేపించవచ్చు. వారు చెప్పేదేమంటే రామాది వద్వర్తితవ్యమ్ నరావణాది వత్తని ఉత్తమ మానవ ధర్మాలను లోకానికి చాటటానికే రామాయణం రచించాడు వాల్మీకి. అంతవరకే ఆయన దృష్టి అది ఆయన చేసిన కావ్యసృష్టిలో మనకు బాహటంగానే
Page 10