#


Index

రామ యాథాత్మ్యము

ఈ రెండు దరులనూ ఒరసి కొని పారే కథావాహినిలో మాత్రమే అలా కంఠోక్తిగా వర్ణించలేదాయన. బాహాటంగా వర్ణించలేదనే గాని చాటుమాటుగా సూచన చేయటం మాత్రం మానలేదాయన. ఆద్యంతాలలో ఐతిహాసిక ధోరణిలో వాచ్యం చేసి చెబితే మధ్యలోనంత కావ్యమార్గంలో ఆ సత్యాన్ని ప్రతీయమానం చేస్తూ వచ్చాడు. అదే ఆయనగారి రచనా చాతుర్యం. ఎంత మహర్షి అంత మహాకవి కూడా కదా వాల్మీకి. మధుమయ ఫణితీనామ్ మార్గదర్శీ అని తరువాతి కవులంతా ఆయనను కీర్తించారంటే మరి ఆ పరిధిలో ఆ మాత్రం చమత్కృతి లేకుంటే ఎలాగ ? అది భాగీరథి కథలో వెతుకుతూపోతే అక్కడక్కడా మణికర్ణికాది ఘట్టాలలాగ కనులకు కట్టినట్టు దర్శనమిస్తూ వస్తుంది మనకు. చూతామది ఎలాంటిదో. బాలకాండలో విశ్వామిత్రుడు వస్తాడు దశరథుడి దగ్గరికి రాముణ్ణి తనతో పంపమని అడగటానికి. ఆ మాట వింటూనే హడలిపోతాడు దశరథుడు. అప్పుడు విశ్వామిత్రుడనే మాట వినండి. అహంతే ప్రతిజానామి, హతాంస్తాన్ విద్ధిరాక్షసాన్, అహంవేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వసిష్టోపి మహాతేజా - యేచేమే తపసిస్థితాః రాముడు ఆ రాక్షసులను చంపలేడనే మాట మరచిపో. ఆయన మహాత్ముడు. సత్యపరాక్రముడు. ఆయన సంగతి నీకేమి తెలుసు. నాకు తెలుసు. ఈ వసిష్ఠుడికి తెలుసు. ఇంకా ఇక్కడ ఉన్న మహర్షులందరికీతెలుసు. అంటేనీకు పుత్రుడుగా కనపడుతున్న వాడీ జగత్తుకంతా పితామహుడైన బ్రహ్మదేవుడికి కూడా పితృదేవుడని, ఆ తత్త్వం తపస్సంపన్నులకు తప్ప ప్రాకృత బుద్ధుల కర్థమయ్యేదికాదని భావం. వసిష్ఠుడుకూడా గట్టిగా అలా బలపరిచిన మీదట ఒప్పుకొంటాడు దశరథుడు. రాముణ్ణి పిలిపించి విశ్వామిత్రుడి కప్పగిస్తాడు. ఆ తరువాత విశ్వామిత్రో యయావగ్రే - తతో రామోమహా యశాః అని వర్ణిస్తాడు కవి. తండ్రితోగాని, ఆచార్యుడితోగాని, కడకు విశ్వామిత్రుడితోగాని, ఒక్క మాట మాట్లాడకుండా ఆయన నడుస్తుంటే ఆయనతోపాటు మౌనంగా నడుస్తూ పోతాడు రాముడు. చూడండి ఇది ఎంత చిత్రమో. ఎక్కడికీ ఎందుకని అడగకుండా వెళ్లే వాడెవడైనా ఉంటాడా ? తెలియని మానవుడైతే అడగాలిగానీ అన్నీ తెలిసిన భగవానుడడగటం దేనికి. తెలుసు గనుక మౌనంగా వెళ్లిపోయాడు.

  అంతేకాదు. మార్గమధ్యంలో బలాతి బలాదులైన అస్త్రవిద్యల నాయనకు ప్రదానం చేస్తాడు విశ్వామిత్రుడు. అవి కూడా మౌనంగానే స్వీకరిస్తాడు గాని ఒక్క

Page 129

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు