#


Index

రామ యాథాత్మ్యము

సమాప్తమయింది. మరి రావచ్చు వైకుంఠానికి. లేక ఇంకా ఈ ప్రజాపాలన చేయటం నీకిష్టమైతే ఉండిపోవచ్చు. అలా కాక రావాలనుకుంటే దేవలోకం విష్ణు సాన్నిధ్యంతో సనాథమవుతుంది. ఇంతకన్నా సాభిప్రాయమైన మాట ఏముంటుంది. దానికి తగినట్టే ఉంది రాముడిచ్చిన జవాబు కూడా చూడండి. త్రయాణా, మపిలోకానామ్, కార్యార్థం మమ సంభవః, భద్రంతేస్తు గమిష్యామి, యత ఏవాహమా గతః హృద్గతో హ్యసి సంప్రాప్తో, నమేతత్ర విచారణా, ఓయీ నేనీ త్రిలోకవాసులకు సంబంధించిన కార్యమేదో దానికోసమవతరించాను. అది సక్రమంగా ముగిసింది. ఇక నాకు పనిలేదు. వచ్చిన చోటికే వెళ్లిపోతాను. నా మనసులో ఉంది నీవు వస్తావని రానే వచ్చావు. చాలా సంతోషం. ఇంతకన్నా రాముడి స్వరూప స్మృతికి తార్కాణమేముంది.

  మరొక సన్నివేశం చూచినా తేటపడుతుందిది మనకు. రామనిర్యాణం కూడా ఒక అద్భుతమైన సందర్భమే. సరయూసలిలే రామః పద్భ్యామ్ సముపచక్రమే సరయూ జలంలో రాముడు ప్రవేశిస్తాడు. తతఃపితామహోవాణీ, మంతరిక్షా దభాషత వెంటనే బ్రహ్మదేవుడాకాశంలో నుంచి ఇలా అంటాడు. ఆగచ్ఛవిష్ణో భద్రంతే, దిష్ట్యా ప్రాప్తోసి రాఘవ తానుమ్ ప్రవిశస్వకామ్ వైష్ణవీమ్. వైష్ణవమైన నీ దివ్య శరీరాన్ని ప్రవేశించమని కోరుతాడు. వివేశ వైష్ణవం, తేజ స్సశరీర స్సహానుజః అనుజులతో కూడా వైష్ణవమైన మూర్తినే భజించాడట రాముడు. అనుజులు కూడా తన అంశలే కాబట్టి అంతా కలిసి ఒకేమూర్తి అయిందని భావం. పైగా సశరీరంగా అనటంవల్ల ఇది మరణంకాదని తెలుస్తున్నది. రాముడు జన్మించాడు కాని మరణించలేదు. దీనికి భిన్నంగా కృష్ణుడు జన్మించలేదు. కాని మరణిస్తాడు. మరణించటం వల్లనే గదా అర్జునాడాయన కళేబరాన్ని దహనం చేయవలసివచ్చింది. ఇందులో మనం గ్రహించవలసిన సూక్ష్మమేమంటే ఇద్దరూ అసలు జన్మించనూలేదు. మరణించనూ లేదు. ఎందుకంటే జన్మ ఉందంటే మరణముండి తీరుతుంది. మరణముందంటే జన్మ ఉండక తప్పదు. అందులో ఏ ఒకటి లేకపోయినా మరొకటి ఉండటానికి లేదు. దీనిని బట్టి రెండూ జననమరణాలు లేనివే. కనుకనే రెండూ భగవదవతారాలేనని సాకూతంగా ద్యోతనం చేసినట్టవుతున్నది.

  ఇంతకూ తేలిందేమంటే రామాయణ మాద్యంతాలు ఏ మాత్రం తడవి చూచినా రాముడి భగవత్తత్త్వం మనకు కంఠోక్తిగానే బయట పెడుతున్నాడు మహర్షి. పోతే

Page 128

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు